బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss Nonstop)నాలుగు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక వారాంతం కావడంతో షో నుండి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. వారియర్స్ నుండి యూట్యూబర్ సరయు ఎలిమినేట్ అయ్యారు.
ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున(Nagarjuna) ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం మొత్తం సభ్యుల ప్రవర్తన పై సమీక్ష జరిపిన నాగార్జున ఎలిమినేషన్ కూడా పూర్తి చేశారు. ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో సరయు ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. నామినేషన్స్ లో ఉన్న వారిలో అతి తక్కువ ఓట్లు సంపాదించిన సరయు ఎలిమినేటైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఆదివారం సరయు హౌస్ ని వీడాల్సి వచ్చింది. బయటికొచ్చిన సరయు హౌస్ లో తనకు నచ్చని కంటెస్టెంట్స్ కి వాంటెడ్ బోర్డ్స్ ఇచ్చారు.
అఖిల్, అరియనా, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్ లకు ఆమె వాంటెడ్ బోర్డ్స్ ఇచ్చారు. ఇక మొదటివారమే హౌస్ నుండి సరయు ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సరయు మొదటివారమే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఆమె జర్నీ ఎక్కువ కాలం సాగలేదు. నాలుగు వారాల్లోనే ఎలిమినేటై బయటికొచ్చేశారు.
యూట్యూబర్ గా సరయు (Sarayu)మంచి క్రేజ్ సంపాదించారు. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో బోల్డ్ కంటెంట్ తో ఆమె చేసిన సినిమా రివ్యూలు, షార్ట్ ఫిలిమ్స్ బాగా వైరల్ అయ్యాయి. పచ్చి బూతులు మాట్లాడే సరయు యాటిట్యూడ్ కి ఓ వర్గం యూట్యూబ్ ఆడియన్స్ పడిపోయారు. అలా సోషల్ మీడియా సెన్సేషన్ గా బిగ్ బాస్ 5లో పాల్గొనే అవకాశం ఆమెకు దక్కింది.
ఇక మొదటివారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీరాపాక, మూడవ వారం ఆర్జే చైతూ ఎలిమినేట్ కావడం జరిగింది. 17 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమైంది. నలుగురు ఎలిమినేషన్స్ తో హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక 24*7 ఫార్మాట్ లో సాగుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. తెలుగులో ఫస్ట్ టైం ఓటీటీ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు.
