Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: కౌశల్ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుంటాడా..?

బిగ్ బాస్ సీజన్ 2 లో బంధాలకు దూరంగా ఉంటూ గేమ్ మీద దృష్టి పెట్టే కంటెస్టెంట్ కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా వంటి దేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. 

bigg boss: kaushal self elimination
Author
Hyderabad, First Published Sep 19, 2018, 3:48 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 లో బంధాలకు దూరంగా ఉంటూ గేమ్ మీద దృష్టి పెట్టే కంటెస్టెంట్ కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా వంటి దేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు ఎంతో సహనంగా గేమ్ ఆడుతూ వస్తోన్న కౌశల్ రెండు రోజులుగా తన సహనం కోల్పోయి హౌస్ మేట్స్ మీద విరుచుకుపడుతున్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ కొట్టుకునే వరకు వెళ్లారు. మధ్య బిగ్ బాస్ కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అందులో కౌశల్ హౌస్ మేట్స్ అందరినీ కుక్కలు అంటూ కామెంట్స్ చేయడంతో అందరూ మరోసారి కౌశల్ ని టార్గెట్ చేస్తూ గొడవ పడుతున్నారు. కౌశల్ ని బ్యాడ్ చేయడానికే బిగ్ బాస్ ఇదంతా చేస్తున్నాడని కౌశల్ ఆర్మీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది.

ఏదేమైనా కౌశల్ తన సహనాన్ని కోల్పోయి రెచ్చిపోతున్న దృశ్యాలు మాత్రం బిగ్ బాస్ లో కనిపిస్తున్నాయి. అలాగని ప్రేక్షకుల్లో ఆయనకి ఆదరణ తగ్గుతుందనుకుంటే పొరపాటే. కౌశల్ తప్పు చేసినా.. ఆయన కరెక్ట్ అనే అంటున్నారు అభిమానులు. ఓట్ల పరంగా చూసుకుంటే కౌశల్ కి ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆయన్నే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇది బిగ్ బాస్ టీమ్ కి ఇష్టం లేదు కాబట్టి కౌశల్ ఆయనకు ఆయనే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకునే విధంగా పరిస్థితులను మార్చబోతున్నారని టాక్. కౌశల్ గనుక సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోకపోతే అప్పుడు బలవంతంగా ఆయన్ని బయటకి పంపాలి. అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేని పరిస్థితి.  

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ ది పెయిడ్ ఆర్మీ.. ప్రముఖ మీడియా కథనం!

బిగ్ బాస్ 2: హౌస్ మేట్స్ ని కుక్కలని తిట్టిన కౌశల్..

బిగ్ బాస్2: కౌశల్, తనీష్ ఒకరినొకరు తన్నుకునేంతగా..

నానిపై కౌశల్ ఆర్మీ పోలీస్ కేసు పెట్టనున్నారా..?

 

Follow Us:
Download App:
  • android
  • ios