Asianet News TeluguAsianet News Telugu

'మహానటి' దర్శకుడితో చిరు.. ఇదిగో క్లారిటీ!

'మహానటి' సినిమాను రూపొందించిన దర్శకుడు నాగఅశ్విన్ ని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిభని కొనియాడుతూ మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.

ashwani dutt about naga ashwin film with chiranjeevi
Author
Hyderabad, First Published Sep 18, 2018, 4:18 PM IST

'మహానటి' సినిమాను రూపొందించిన దర్శకుడు నాగఅశ్విన్ ని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిభని కొనియాడుతూ మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.

ఆ సమయంలో నాగఅశ్విన్ తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తారని అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు వినిపించాయి. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో నాగఅశ్విన్ ఓ కథను సిద్ధం చేస్తున్నారని, ఆ కథతోనే చిరు సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఈ సినిమాపై ఎలాంటి ఊసు  లేకుండా పోయింది. అయితే అసలు ఈ సినిమా ఉంటుందా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అశ్వనీదత్.

''చిరంజీవి కోసం నాగఅశ్విన్ కథ రాయడం ప్రారంభించారు. దాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలనేది నాకు తెలియడం లేదు. కాకపోతే ఈ సినిమా భారీగా ఉంటుంది చూడాలి'' అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కోసం ఈ కథ సిద్ధం చేయడం లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''నేను అనుకోవడం లేదు.. నాగఅశ్విన్ ఒక స్టేజీలో చెప్పినప్పుడు చిరంజీవి గారికి యాప్ట్ గా ఉంటుందని అనుకున్నాను.

అతను కూడా అప్పట్లో అదే ఫీల్ అయ్యాడు. డెవలెప్మెంట్స్ లో అది ఎలా వెళ్తుంది..? అనేది ఇప్పుడే చెప్పలేం. అదీ కాకుండా కథ షేప్ కి వచ్చాక చిరంజీవి గారికి వినిపించాలి. ఆయన, దర్శకుడు ఇష్టపడితేనే కదా సినిమా పట్టాలెక్కుతుంది'' అని వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios