Asianet News TeluguAsianet News Telugu

నానిపై కౌశల్ ఆర్మీ పోలీస్ కేసు పెట్టనున్నారా..?

టాలీవుడ్ లో క్లీన్ ఇమేజ్ తో అభిమానులను సంపాదించుకున్న హీరో నానిపై ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ నమోదు చేయనున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Bigg Boss 2: Will Kaushal Army really file a police complaint against Nani?
Author
Hyderabad, First Published Sep 18, 2018, 5:54 PM IST

టాలీవుడ్ లో క్లీన్ ఇమేజ్ తో అభిమానులను సంపాదించుకున్న హీరో నానిపై ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ నమోదు చేయనున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం బిగ్ బాస్ షో అని తెలుస్తోంది. నాని హోస్ట్ గా బిగ్ బాస్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా నాని.. కౌశల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో కౌశల్ ఆర్మీ అతడిని టార్గెట్ చేసింది.

నాని హోస్టింగ్ బాగాలేదని విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నానిని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి ఎక్కడివరకు వెళ్లాయంటే నానిపై కేసు పెట్టాలని చూస్తోంది కౌశల్ ఆర్మీ. వివరాల్లోకి వెళితే.. 'సిల్లీ ఫెలోస్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్, నరేష్ లు హౌస్ లోకి వచ్చినప్పుడు హౌస్ మేట్స్ అందరూ రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గేమ్ ఆడారు.

నాని పెదరాయుడు అంటూ కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కౌశల్.. సునీల్ తల్లి పాత్రని పోషించాడు. ఆ తల్లి పాత్రని నాని ప్రశ్నిస్తూ.. ఇద్దరు కొడుకులను ఎందుకు దత్తత తీసుకున్నారు.. మీ ఆయనతో స్పర్శ వర్కవుట్ కాలేదా..? అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యాఖ్యలను పట్టుకొని కౌశల్ ఆర్మీ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి నానిపై కేసు నమోదు చేయాలని, ఆడవారి గురించి అనుచితంగా మాట్లాడినందుకు అతడిపై కేసు బుక్ చేయాల్సిందిగా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ పై స్పందించిన హైదరాబాద్ పోలీసులు.. మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండని రిప్లయ్ చేశారు. దీంతో ఇప్పుడు కౌశల్ ఆర్మీ సభ్యులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios