బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోగా... వచ్చే ఆదివారం విన్నర్ ఎవరో తేలిపోనుంది. అరియనా, అఖిల్, అభిజిత్, సోహైల్ మరియు హారిక హౌస్ లో ఉన్నారు. ఫైనలిస్ట్స్ గా చివరి వారానికి చేరుకున్న ఈ ఐదుగురు నుండి ఒకరు విన్నర్ మరొకరు రన్నర్ కానున్నారు. 
 
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ జర్నీని బిగ్ బాస్ ఏవీ రూపంలో చూపిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క కంటెస్టెంట్ జర్నీ చూపించే ముందు, ఆ కంటెస్టెంట్ గురించి బిగ్ బాస్ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ముందుగా అఖిల్ వెళ్లగా తన జర్నీని గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు బిగ్ బాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా హృదయంతో పాటు బుద్ధితో నువ్వు ఆడిన తీరు బాగుందని బిగ్ బాస్ ప్రశంసించాడు. పరోక్షంగా మోనాల్ తో తన ప్రేమ విషయాన్ని కూడా బిగ్ బాస్ లేవనెత్తాడు. 
 
అఖిల్ కోసం బిగ్ బాస్ రూపొందించిన వీడియోలో మోనాల్ తో తన లవ్ జర్నీని చూపించారు. ఒకరిపై ఒకరు చూపించుకున్న ప్రేమ, గొడవలు, గిల్లికజ్జాలు ప్రముఖంగా చూపించాడు బిగ్ బాస్. అఖిల్ ఏవిలో మోనాల్ తో లవ్ జర్నీనే హైలెట్ గా నిలిచింది. ఏవి చూసిన అఖిల్... ఎమోషనల్ అయ్యారు.  కష్టపడి ఫైనల్ కి వచ్చానని చెప్పిన అఖిల్ తనకు ఓట్లు వేసిన అందరికీ పాదాభివనం అని అఖిల్ చెప్పడం జరిగింది. తన ఏవీ అద్భుతంగా ఉందని, తన గురించి బిగ్ బాస్ గొప్పగా మాట్లాడని, అఖిల్ ఇంటి సభ్యులతో చెప్పి సంతోషపడ్డాడు. 
 
ఆ తరువాత తన స్పెషల్ జర్నీ చూడడం కోసం అభిజీత్ వెళ్ళాడు. ఇక హౌస్ అత్యంత మెచ్యూర్డ్ మాన్ గా అభిజీత్ ని బిగ్ బాస్ వర్ణించాడు. యంగ్ చార్మింగ్ బాయ్ లా ఇంటిలోకి ఎంటరై మెచ్యూర్డ్ గాయ్ గా అవార్డు పొందారు అన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని మీరు మిస్టర్ కూల్ అన్నాడు. కొన్ని సందర్భాలలో మీరు మీలోని ఎమోషన్స్ దాచుకున్నారని. మీ ఎమోషన్స్ అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు అన్నాడు. ముఖ్యంగా మీకంటే ఎక్కువగా మీరు ఇతరుల గురించి ఆలోచించారు అన్నారు. 
 
అభిజీత్ ని పొగడ్తలతో ముంచిన బిగ్ తన ఏవి చూపించాడు. అభిజీత్ జర్నీని బిగ్ బాస్ చూపించడం జరిగింది. ఐతే అఖిల్ ఏవిలో వలె... అభిజీత్ ఏవిలో కూడా మోనాల్ తో ప్రేమ జర్నీ ప్రత్యేకంగా చూపించాడు. మొదట్లో మోనాల్ ని లైన్ లో పెట్టడానికి అభిజీత్ చాలా ట్రై చేశాడు. మోనాల్ కూడా అభిజీత్ కి దగ్గరైనట్లు కనిపించింది. ఆ విధంగా అఖిల్ మరియు అభిజీత్ బిగ్ బాస్ హౌస్ జర్నీ ఏవిలో మోనాల్ కామన్ లవర్ గా కనిపించారు. రేపటి ఎపిసోడ్ లో మిగిలిన సోహైల్, అరియనా మరియు హారిక జర్నీ చూపించనున్నాడు.