వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా 13వారాలు కొనసాగారు. కమెడియన్ గా హౌస్ లో నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యాడు. కింగ్ నాగార్జున సైతం అవినాష్ కామెడీని ఎంతగానో ఆస్వాదించేవాడు. అందుకే ఎలిమినేటై వెళ్ళిపోయే రోజు కూడా అవినాష్ హౌస్ లోని ప్రతి ఇంటి సభ్యుడిని ఇమిటేట్ చేసి బాగా నవ్వించాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరతాడనుకున్న అవినాష్ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం జరిగింది. మోనాల్ ని సేవ్ చేయడం కోసమే అవినాష్ ని బలిచేశారన్న అపవాదు కూడా ఉంది. 
 
కాగా ఎలిమినేటైన అవినాష్ కి నాగార్జున సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ విషయాన్ని అవినాష్ తాజాగా వెల్లడించడం జరిగింది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున షో కోసం ధరించిన తన షర్ట్ అవినాష్ కి బహుమతిగా ఇచ్చాడట. రెడ్ కలర్, పూల డిజైన్ కలిగిన షర్ట్ ని ధరించి నాగార్జున ఓ రోజు వేదికపైకి రావడం జరిగింది. హౌస్ లో ఉన్న అవినాష్, నాగ్ సర్.. మీ షర్ట్ చాలా బాగుందని అన్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న నాగార్జున, ఆ రోజు షో ముగిసిన తరువాత షర్ట్ అవినాష్ కి ఇవ్వండని నిర్వాహకులకు చెప్పాడట. హౌస్ నుండి బయటికి వచ్చాక అవినాష్ కి బిగ్ బాస్ యాజమాన్యం ఆ షర్ట్  ఇచ్చారట. 
 
యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్... ఈ విషయాన్ని తెలియజేశాడు. అలాగే నాగార్జున గిఫ్ట్ గా ఇచ్చిన ఆ షర్ట్ ధరించి ఫోటో దిగారు. సదరు ఫోటోని సోషల్ మీడియాలో పంచుకొని తన సంతోషం వ్యక్తం చేశాడు. నాగార్జున లాంటి స్టార్ తన కోరిక మన్నించి, షర్ట్ గిఫ్ట్ గా ఇవ్వడాన్ని అవినాష్ ఎంతో గొప్ప విషయంగా ఫీలవుతున్నాడు.