రేవ్ పార్టీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిలో హిమజతో పాటు 11 మంది టాలీవుడ్ సెలెబ్రిటీల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో బుల్లితెర నటి హిమజ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బోస్ హౌస్ లో హిమజ తనదైన మార్క్ ప్రదర్శించింది. పలు టివి సీరియల్స్ తో గుర్తింపు పొందిన హిమజ, సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది.

హిమజ ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. కానీ తాజాగా దీపావళి పండుగ రోజున హిమజ వార్తల్లోకెక్కింది. హిమజని, మరికొంతమంది టాలీవుడ్ తరాలని పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. హిమజ హైదరాబాద్ నగర శివారులో ఇబ్రహీం పట్నం లోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారనే సమాచారం తో పోలీసులు రైడ్ చేశారు. 

రేవ్ పార్టీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిలో హిమజతో పాటు 11 మంది టాలీవుడ్ సెలెబ్రిటీల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. హిమజ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీలు జరిగాయని వార్తలు రావడంతో అంతా షాక్ అయ్యారు. 

హిమజ ఏంటి ఇలా చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఈ వార్తలపై హిమజ తాజాగా స్పందించింది. ప్రజల్లోకి తన గురించి తప్పుగా వార్తలు వెళుతుండడంతో హిమజ స్పందించింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వీడియో సందేశం ఇచ్చింది. 

నేను అరెస్ట్ అయినట్లు, రేవ్ పార్టీలు నిర్వహించినట్లు కొన్ని మీడియా సంస్థల్లో, యాప్స్ లో వార్తలు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులని, బంధువుల్ని పిలిచి దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నాం. ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. 

View post on Instagram

పోలీసులు వచ్చిన సంగతి వాస్తవమే. ఎలక్షన్ టైం కాబట్టి సాధారణంగా రైడ్ చేశారు. వారికి మేము పూర్తిగా సహకరించాం. వాళ్ళపని వాళ్ళు చేసుకుని వెళ్లిపోయారు. అంతకి మించి ఇంకేమీ జరగలేదు. కొందరు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేసే వారి గురించి నేనేమి చెప్పనవసరం లేదు. ఇంట్లో ఉంటూ దీపావళి పూజ చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. నేను అరెస్ట్ అయితే ఇంట్లో ఎందుకు ఉంటా అని హిమజ తన వివరణ ఇచ్చింది.