ప్రశాంత్, రతిక ఎఫైర్ కి మధ్యవర్తిగా మారిన బిగ్ బాస్.. బొక్కలో బాస్ అంటూ శివాజీ ఫైర్, సగం పరువు పాయె
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 తొలి వారం అంతా గందరగోళంగా మారింది. అంతా మారిపోయింది అని చెప్పారు కానీ.. గందరగోళం అవుతోందనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 తొలి వారం అంతా గందరగోళంగా మారింది. అంతా మారిపోయింది అని చెప్పారు కానీ.. గందరగోళం అవుతోందనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. హౌస్ లో ఎవరికీ వారు సోలో పెర్ఫార్మర్లు అయిపోతున్నారు. ఏకంగా బిగ్ బాస్ మధ్యలో దూరి ఎక్కువగా సెటైర్లు వేయడం.. అలా రొమాన్స్ చేయండి, ఇలా చేయండి అని చెప్పడంతో నెటిజన్లు బిగ్ బాస్ పై సెటైర్లు వేస్తున్నారు.
బిగ్ బాస్ కాస్త రాను రాను మధ్యవర్తిగా మారుతున్నారు అంటూ మామూలుగా ట్రోల్ చేయడం లేదు. ప్రియాంక, సందీప్ బీస్ట్ తో పోటీపడి కంటెండర్స్ గా అర్హత సాధించారని.. మూడవ పోటీదారుడిగా ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళని ఎంపిక చేస్తాను అని బిగ్ బాస్ అన్నారు.
ఇక హౌస్ లో కాఫీ కోసం ఎవరికీ వారు పెర్ఫామెన్స్ మొదలు పెట్టారు. శివాజీ అయితే కాఫీ కోసం పెద్ద వీరంగమే చేశారు. నన్ను రెచ్చగొడితే అన్ని పగలగొట్టి వెళ్ళిపోతా. బిగ్ బాస్ కాదు బొక్కలో బాస్.. నేను ఎవరికీ భయపడను అంటూ గట్టిగా అరిచాడు. శివాజీ అలా మాట్లాడుతుండడంతో బిగ్ బాస్ అతడికి బిపి కిట్ పెంపించాడు. శివాజీ బిపి చెక్ చేయమని బిగ్ బాస్ గౌతంకృష్ణ ని ఆదేశించాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకి గాఢ ప్రేమికులుగా మారుతున్న రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య మధ్యవర్తిత్వం చేశాడు. ప్రశాంత్ గుండె ఏమని కొట్టుకుంటుందో చెక్ చేయాలనీ బిగ్ బాస్ రతికని అడగడం ఫన్నీగా అనిపించింది. కానీ కంటెస్టెంట్స్ దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో బిగ్ బాస్ మీడియేటర్ గా చులకన అయిపోయారు. సోషల్ మీడియాలో పలు సెటైర్లు పేలుతున్నాయి.
బిగ్ బాస్ చెప్పగానే రాతిక స్టెతస్ స్కోప్ ని ప్రశాంత్ గుండెపై పెట్టింది. రతిక రతిక అని కొట్టుకుంటోంది అంటూ రతిక బిగ్ బాస్ కి రొమాంటిక్ గా చెప్పింది. మరోసారి రతిక ప్రశాంత్ హార్ట్ బీట్ ని చెక్ చేసింది. ప్రశాంత్ గుండె కొట్టుకోవట్లేదు.. ఎందుకంటే అతడి గుండె నా దగ్గర ఉంది అంటూ ప్రేమకబుర్లు చెప్పింది.
అనంతరం బిగ్ బాస్ శివాజీని యాక్టివిటీ రూమ్ కి పిలిచి కాఫీ ఇచ్చారు. శోభా శెట్టి హౌస్ లో ఎవరినైనా ఫ్లటింగ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీనితో శోభా శెట్టి రొమాంటిక్ గా టేస్టీ తేజ ని ఫ్లట్ చేసింది. ఇక బిగ్ బాస్ ఒక్కొక్కరిని పర్సనల్ గా పిలిచి హౌస్ లో గాసిప్స్ గురించి అడిగారు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది. కాగా ఈ వారం, దామిని, కిరణ్ రాథోడ్, గౌతమ్, ప్రశాంత్, యావర్, రతిక, షకీలా, శోభా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు.