Asianet News TeluguAsianet News Telugu

విచిత్ర-బాలయ్య వివాదం... బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ రియాక్షన్ ఏంటి?

బిగ్ బాస్ కంటెస్టెంట్ విచిత్ర క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపాయి. విచిత్ర హీరో బాలకృష్ణను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారని ప్రచారం జరుగుతుండగా కమల్ హాసన్ స్పందనపై ఉత్కంఠ నెలకొంది. 
 

bigg boss fame vichitra casting couch allegations over balakrishna will kamal haasan reacts ksr
Author
First Published Nov 23, 2023, 5:11 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ విచిత్ర తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పింది. అందుకే చిత్ర పరిశ్రమకు దూరమయ్యాను అన్నారు. 2001లో ఓ తెలుగు స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె అన్నారు. నా పేరు కూడా తెలియదు. రూమ్ కి రమ్మన్నాడు. రోజూ తాగి వచ్చి రూమ్ డోర్ బాదేవాడు. నేను లొంగలేదని సెట్స్ లో ఇబ్బందులకు గురి చేశాడు. ఒక వ్యక్తి నన్ను అసభ్యంగా తాకితే ఫిర్యాదు చేశాను. అతనిపై చర్యలు తీసుకోగ పోగా తిరిగి స్టంట్ డైరెక్టర్ నన్ను కొట్టాడు... ఇలా అనేక ఆరోణలు ఆమె చేశారు. 

విచిత్ర కామెంట్స్ పై ఇండియా వైడ్ చర్చ నడుస్తుంది. బిగ్ బస్ షో వేదికగా ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో హోస్ట్ కమల్ హాసన్ ఎలా స్పందిస్తారనే చర్చ మొదలైంది. కాగా విచిత్ర కామెంట్స్ హీరో బాలకృష్ణ గురించే అని చర్చ నడుస్తుంది. ఆయన హీరోగా నటించిన భలేవాడివి బాసూ మూవీ 2001లో విడుదలైంది. ఈ చిత్రంలో విచిత్ర అడవి తెగ అమ్మాయిగా ఓ పాత్ర చేసింది. 

వీకెండ్ లో వచ్చే కమల్ హాసన్ ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. సోషల్ మీడియాలో దీని గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. చిన్మయి శ్రీపాద వంటి వారు ఈ విషయం మీద స్పందించారు. కాబట్టి కమల్ హాసన్ మాట్లాడాల్సి ఉంటుంది. ఇది బాలయ్య గురించి అంటున్నారు కాబట్టి కమల్ హాసన్ లైట్ తీసుకుంటారు. ఈ వివాదం పెద్దది చేయరని కొందరు అంటున్నారు. కమల్ హాసన్ మాట్లాడితే ఆయన గౌరవం, నిజాయితీ పెరుగుతాయని మరికొందరి వాదన. మరి చూడాలి కమల్ హాసన్ ఏం చేస్తాడో... 

సౌందర్యను కొట్టానని గొప్పగా చెప్పుకున్నాడు... బాలకృష్ణ-విచిత్ర వివాదంపై చిన్మయి శ్రీపాద కామెంట్స్
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios