Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ 'లక్కీ లక్ష్మణ్' ట్రైలర్ చూశారా... కొత్తగా ట్రై చేశాడే!

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా దర్శకుడు అభి ఏ ఆర్ దర్శకత్వం వహించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు. 
 

bigg boss fame sohel starer lucky lakshman trailer out now
Author
First Published Dec 24, 2022, 10:21 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సోహెల్ మంచి ఫేమ్  రాబట్టారు. ఆ షోతో వచ్చిన గుర్తింపుతో ఆయన వరుస చిత్రాలు ప్రకటించారు. వాటిలో లక్కీ లక్ష్మణ్ ఒకటి.  డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అభి ఏ ఆర్ తెరక్కించారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆకట్టుకుంది. 

పనీ పాట చేయకుండా ధనవంతుడు కూతురిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలనే మెంటాలిటీ ఉన్న లక్ష్మణ్ అనే యువకుడి కథకు లవ్, ఎమోషన్ జోడించి లక్కీ లక్ష్మణ్ తెరకెక్కించారు అనిపిస్తుంది. ఇక మూవీలో కామెడీ పాళ్ళు బాగానే ఉండే సూచనలు కలవు. గీతూ రాయల్ తో పాటు జబర్దస్త్ కమెడియన్స్ పలువురు నటించారు. బిగ్ బాస్ షో అనంతరం సోహెల్ నటించిన మొదటి మూవీ లక్కీ లక్ష్మణ్. మరి ఈ సింగరేణి ముద్దు బిడ్డను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. 

అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా... మోక్ష హీరోయిన్ గా నటించారు. కాగా లక్కీ లక్ష్మణ్ చిత్ర ప్రమోషన్స్ సమయంలో  సోహైల్ ప్రమాదానికి గురయ్యాడు. మూవీ ప్రమోషన్స్ కొంచెం డిఫరెంట్ గా చేద్దామని సోహైల్ వైజాగ్ పోయాడు. అక్కడ లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబర్ ఉన్నాడు. లోకల్ బాయ్ నాని సముద్రంలో చేపల పడుతూ, జాలర్ల జీవితాలు తన వీడియోల్లో ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ విధంగా లోకల్ బాయ్ నానికి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. నానిని కలిసిన సోహైల్ బోటులో సముద్రంలోకి వెళ్ళాడు. వల ఎలా విసరాలి, చేపలు ఎలా పడతారు ఇలా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. బోటు చివర నిల్చొని ఫోటోలు దిగే క్రమంలో సోహైల్ జారీ నీళ్లలో పడ్డాడు. లోతైన నీళ్లలో ఈత రాక ఇబ్బంది పడుతున్న సోహైల్ ని లోకల్ బాయ్ నాని కాపాడి బోటులోకి చేర్చాడు. లక్కీ లక్ష్మణ్ ప్రమోషన్స్ కొంచెం డిఫరెంట్ గా చేద్దామని సోహైల్ వైజాగ్ పోయాడు. అక్కడ లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబర్ ఉన్నాడు. లోకల్ బాయ్ నాని సముద్రంలో చేపల పడుతూ, జాలర్ల జీవితాలు తన వీడియోల్లో ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ విధంగా లోకల్ బాయ్ నానికి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. 

నానిని కలిసిన సోహైల్ బోటులో సముద్రంలోకి వెళ్ళాడు. వల ఎలా విసరాలి, చేపలు ఎలా పడతారు ఇలా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. బోటు చివర నిల్చొని ఫోటోలు దిగే క్రమంలో సోహైల్ జారీ నీళ్లలో పడ్డాడు. లోతైన నీళ్లలో ఈత రాక ఇబ్బంది పడుతున్న సోహైల్ ని లోకల్ బాయ్ నాని కాపాడి బోటులోకి చేర్చాడు. ఈ ప్రమాదంలో సోహైల్ కి ఏం కాలేదు, అతడు సురక్షితంగా ఉన్నాడని సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాలికి మాత్రం చిన్న గాయమైనట్లు వినికిడి. అదృష్టం కొద్ది నీటి గండం నుండి సోహైల్ బయటపడ్డారు. ఐతే ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios