Asianet News TeluguAsianet News Telugu

నెరవేరిన తీన్ మార్ సావిత్రి సొంతింటి కల... నూతన గృహప్రవేశం ఫోటోలు వైరల్!

టెలివిజన్ ప్రెజెంటర్ బిగ్ బాస్ ఫేమ్ సావిత్రి గృహ ప్రవేశం చేశారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు హిమజ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

bigg boss fame siva jyothi inaugurates her new house
Author
First Published Dec 4, 2022, 4:09 PM IST

సొంతింటి కల నెరవేర్చుకుంది తీన్ మార్ సావిత్రి. ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశం చేశారు. ఈ వేడుకకు నటి హిమజను ఆహ్వానించారు. తీన్ మార్ సావిత్రి నూతన గృహ ప్రవేశానికి హాజరైన హిమజ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మీరు కొత్త ఇల్లు నిర్మించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కలలు నిజం కావాలంటే ఎంత చెమటోడ్చాలో, కష్టపడాలో నాకు తెలుసు, అని హిమజ ట్వీట్ చేశారు. 

తీన్ మార్ సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. ఆమె తీన్ మార్ సావిత్రి ప్రోగ్రాంతో పాపులారిటీ తెచ్చుకోగా... ఆ పేరు స్థిరపడిపోయింది. బిగ్ బాస్ సీజన్ 3 లో సావిత్రి పాల్గొన్నారు. ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. ఏకంగా 14 వారాలు హౌస్లో ఉన్న సావిత్రి ఫైనల్ కి ముందు ఎలిమినేట్ అయ్యారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himaja💫 (@itshimaja)

బిగ్ బాస్ షోలో ఆమె పాపులారిటీ రెట్టింపు అయ్యింది. కొన్నాళ్లుగా ఆమె బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్నారు. చాలా కాలంగా హైదరాబాద్ లో సావిత్రి భర్తతో పాటు అద్దెకు ఉంటున్నారు. ఎట్టకేలకు ఆమె సొంతింటి కల నెరవేరింది. హిమజ సైతం బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు. హిమజ కూడా కొత్తింటి నిర్మాణం చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios