కరోనా జనాల్ని ఎంతగా బయపెడుతోందో చెప్పడానికి తాజా ఉదంతమే నిదర్శనం. బాలీవుడ్ హీరోయిన్ కూరగాయల మార్కెట్ కి పీపీఈ కిట్ లో రావడంతో అందరూ షాక్ తిన్నారు. చాలా సమయం వరకు ఆమె ఎవరో గుర్తించలేకపోయారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తోంది. రోజూ లక్షల్లో కేసులో నమోదు అవుతున్నాయి.  కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు ప్రజలు. కాగా హీరోయిన్ రాఖీ సావంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం  వైరలవుతోంది.అలాగే ఆమె చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

 
సెలబ్రిటీలు పబ్లిక్ ప్రదేశాలలో కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా ఎగబడతారో తెలిసిందే. అందుకే రాఖీ సావంత్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్‌ ధరించి మార్కెట్‌ వెళ్లారు రాఖీ సావంత్‌. అలా కరోనా పట్ల ప్రజలకు అవగాహక కలిపించడం గొప్ప విషయం అంటూ నెటిజెన్స్ కొనియాడుతున్నారు. 
 

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో రాఖీ సావంత్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. తన మార్కు గేమ్ తో ఆమె ప్రేక్షకులను అలరించారు. బిగ్ బాస్ హౌస్ నుండి తన భర్తపై ఆమె ఆరోపణలు చేయడం విశేషం.