బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 పాల్గొన్న ఓవియా హెలెన్ అప్పట్లో పెద్ద సంచలనం. కమల్ హాసన్ హోస్ట్ గా 2017లో సాగిన బిగ్ బాస్ సీజన్ 1 లో ఓవియా తమిళ ప్రేక్షకులకు పిచ్చ వినోదం పంచింది. ముఖ్యంగా ఓవియా హౌస్ లో నడిపిన రొమాన్స్ అండ్ లవ్ స్టోరీ సీజన్ హైలెట్ అయ్యాయి. ఆ సీజన్ విన్నర్ ఆరవ్ కి ఓవియా బాగా దగ్గరయ్యారు. 

షో బిగినింగ్ నుండే ఆరవ్ తో రొమాన్స్ స్టార్ట్ చేసిన ఓవియా... అతన్ని ప్రేమిస్తున్నానంటూ బహిరంగంగా చెప్పేసింది. హౌస్ లో వీరిద్దరి హగ్స్ అండ్ రొమాన్స్ షో టీఆర్పీ పెరగడంలో కారణం అయ్యింది. ఇక మొదట్లో ఓవియాతో సన్నిహితంగా ఉన్న ఆరవ్ చివర్లో ఆమెను దూరం పెట్టడం జరిగింది. షో ముగిసిన తరువాత వీరిద్దరూ మేము జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకోవడం జరిగింది. 

అప్పటి నుండి నా స్టేటస్ సింగిల్ అని చెవుతున్న ఓవియా సడన్ గా ఓ సోషల్ మీడియా పోస్ట్ తో షాక్ ఇచ్చింది. ఆమె ఓ వ్యక్తిని కిస్ చేస్తున్న ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు, 'లవ్' అంటూ ఓ కామెంట్ విసిరింది. దీనితో ఓవియా తోడు వెతుక్కుందని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఓవియా ప్రేమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభ్యర్థిస్తున్నారు. మరి ఫ్యాన్స్ టెన్షన్స్ కి తెరదించుతూ ఆ వ్యక్తి డిటైల్స్ తెలియజేస్తుందో లేదో ఓవియా చూడాలి.