Asianet News TeluguAsianet News Telugu

ప్రిన్స్ యావర్ తో లవ్... క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ పావని!

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రిన్స్ యావర్-నయని పావని సన్నిహితంగా ఉంటున్నారు. కలిసి సాంగ్స్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కాగా నయని పావని స్వయంగా స్పందించింది. 
 

bigg boss fame nayani pavani clarifies love with prince yawar ksr
Author
First Published Feb 22, 2024, 8:05 PM IST | Last Updated Feb 22, 2024, 8:05 PM IST


నయని పావని ఒక్క వారమే హౌస్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని అనూహ్యంగా ఇంటి బాట పట్టింది. ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి అర్జున్ అంబటి, నయని పావని, అశ్విని శ్రీ, భోలే షావలి, పూజ మూర్తిలను ప్రవేశ పెట్టారు. హౌస్లో నిలదొక్కుకునే ఛాన్స్ ఇవ్వకుండానే నయని పావనిని బయటకు పంపేశారు. నయని పావని ఎలిమినేషన్ పై విమర్శలు వినిపించాయి. 

నయని పావని హౌస్లో ఉంటే లవ్ ట్రాక్ నడిచేదేమో. అయితే బయటకు వచ్చాక ఆమె ప్రిన్స్ యావర్ తో సన్నిహితంగా ఉంటుంది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ పాల్గొనే ప్రతి పార్టీ, ఈవెంట్ లో నయని పావని ఉంటుంది. ప్రిన్స్ యావర్ తో కలిసి ఆమె కొన్ని సాంగ్స్ చేసింది. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారి కెమిస్ట్రీ చూసిన జనాలు లవ్ లో పడ్డారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

దీనిపై ఆమెనే స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తాజాగా నయని పావని ఫ్యాన్స్ తో ఆన్లైన్ ఛాట్ చేసింది. ఓ నెటిజెన్... మీరు ప్రిన్స్ యావర్ ని ప్రేమిస్తున్నారా? అని అడిగాడు. అరే ఏంట్రా మీరు... ఇంకో క్వశ్చన్ లేదా? లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అని సమాధానం చెప్పింది. దాంతో పావని-యావర్ కేవలం మిత్రులు మాత్రమే... ప్రేమికులు కాదని స్పష్టత వచ్చింది. 

ప్రిన్స్ యావర్ గతంలో కొన్ని సీరియల్స్ లో నటించాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళాడు. ఫినాలే లో తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. ప్రిన్స్ యావర్ కి నాలుగో స్థానం దక్కింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా... అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios