బిగ్ బాస్ షో మోనాల్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. వెండితెర ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయిన ఈ అమ్మడు మరలా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ తరువాత మోనాల్ కి ఆఫర్స్ వస్తున్నాయి. అల్లుడు అదుర్స్ మూవీలో ఓ ఐటెం సాంగ్ లో తళుక్కున మెరిసింది మోనాల్. సంక్రాంతి కానుకగా అల్లుడు అదుర్స్ మూవీ విడుదల కానుండగా... ఐటెం పాపగా మోనాల్ ఏ రేంజ్ లో అదరగొట్టారో చూడాలి. కాగా హౌస్ లోకి వెళ్ళక ముందే కాగజ్ అనే హిందీ మూవీలో మోనాల్ నటించడం జరిగింది. 

పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రంలో మోనాల్ అతని భార్య రోల్ చేశారు. పక్కా పల్లెటూరి గృహిణి పాత్రను ఆమె చేశారు. బిగ్ బాస్ హౌస్ లో మోడ్రెన్ డ్రెస్సులలో కైపెక్కించిన మోనాల్, దాదాపు డీగ్లామర్ రోల్ లో కనిపించి షాకిచ్చింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా కాగజ్ మూవీలో అలరించారు. కాగా ఈ చిత్రంలోని 'బైల్ గాడీ' సాంగ్ వైరల్ అవుతుంది. యూట్యూబ్ మోనాల్ నటించిన ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. 

జనవరి 7నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్  జీ5లో  కాగజ్ మూవీ అందుబాటులోకి రానుంది.  దర్శకుడు సతీష్ కౌశక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. కాగా కాగజ్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించడం విశేషం. మరోవైపు స్టార్ మా మోనాల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ యాంకర్ అండ్ డైరెక్టర్ ఓంకార్ హోస్ట్ గా మొదలైన డాన్స్ రియాలిటీ షోలో మోనాల్ పాల్గొంటున్నారు.