బిగ్ బాస్ ఫేమ్ దిల్ సే మెహబూబ్ కొత్త కారు కొన్నారు. ఈ సంతోషాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దిల్ సే మెహబూబ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన మహేంద్ర XUV 700 సొంతం చేసుకున్నారు. తన కలల కారు సొంతం చేసుకున్న ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. కొత్త కారు ఎదుట ఫోజులిచ్చారు. దిల్ సే మెహబూబ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెహబూబ్ యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆయన బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. ఆ విధంగా పాపులారిటీ రాబట్టారు. హౌస్లో సోహైల్ తో మెహబూబ్ సన్నిహితంగా ఉండేవాడు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న మెహబూబ్ చాలా వారాలు హౌస్లో ఉన్నాడు. కాగా మెహబూబ్ పై అప్పట్లో ఓ వివాదం నడిచింది. ఎలిమినేటైన మెహబూబ్ ఫినాలేకి ముందు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో సోహైల్ పొజీషన్ మూడు అంటూ సిగ్నల్స్ ఇచ్చాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫైనల్ లో సోహైల్ రూ . 25 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకునేందుకు ఒప్పుకున్నాడు . సోహైల్ అలా చేయడానికి కారణం మెహబూబ్ హింట్స్ ఇవ్వడమేనని విమర్శలు వెల్లువెత్తాయి.
వీటిని సోహైల్, మెహబూబ్ ఖండించారు. ఫైనల్ లో గెస్ట్ గా వచ్చిన చిరంజీవి మెహబూబ్ కి రూ.10 లక్షలు ఇచ్చాడు. దానితో పాటు తాను గెల్చుకున్న రెమ్యూనరేషన్ కలిపి గుంటూరులో మెహబూబ్ ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవల మెహబూబ్ బీబీ జోడిలో పార్టిసిపేట్ చేశాడు. శ్రీసత్య-మెహబూబ్ బీబీ జోడిలో ఒక జంటగా పాల్గొన్నారు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ ఫైమా-సూర్య సొంతం చేసుకున్నారు.
