Asianet News TeluguAsianet News Telugu

నా కళ్లు బాలేవన్నారు.. ఘోరంగా ఏడ్చేశా.. బిగ్‌ బాస్‌ హిమజ వ్యాఖ్యలు..

కెరీర్‌ బిగినింగ్‌లో పలు నెగటివ్‌ కామెంట్లని ఎదుర్కొన్నట్టు చెప్పింది హిమజ. అంతేకాదు బాడీ షేమింగ్‌ కామెంట్లని కూడా ఫేస్‌ చేసినట్లు చెప్పింది. హిమజ చెబుతూ సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో తాను చాలా సందర్భాల్లో ఏడ్చినట్టు చెప్పింది. 

bigg boss fame himaja remembering her bad moments in career beginning
Author
First Published Mar 17, 2023, 10:21 PM IST

నటిగా ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకుంది హిమజ. బిగ్‌ బాస్‌ షోతో బాగా పాపులర్‌ అయ్యింది. షోస్‌, టీవీ, సినిమాలతో అలరిస్తున్న హిమజ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఫేస్‌ చేసిన సంఘటనలను పంచుకుంది. కెరీర్‌ బిగినింగ్‌లో పలు నెగటివ్‌ కామెంట్లని ఎదుర్కొన్నట్టు చెప్పింది. అంతేకాదు బాడీ షేమింగ్‌ కామెంట్లని కూడా ఫేస్‌ చేసినట్లు చెప్పింది హిమజ. ఆమె ఉమెన్స్ డే సందర్భంగా ఓ టీవీకి(ఏబీఎన్‌) కి ఇచ్చిన చిట్‌చాట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. అయితే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ గా మారడం విశేషం. 

ఇందులో హిమజ చెబుతూ సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో తాను చాలా సందర్భాల్లో ఏడ్చినట్టు చెప్పింది. అందరిలాగే తాను ఇబ్బందులు పడ్డానని, ఎత్తుపల్లాలను చవిచూసినట్టు, ఒకానొక సమయంలో ఘోరంగా ఏడ్చానని తెలిపింది. సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది, మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనకు తెలిసినట్టయితే, మనం చేసే పని కరెక్ట్ పని అయితే, ఎవరు చెప్పినా ఆగేది లేదని చెప్పింది. నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగాలని, పనికి రాని మాటలని విని వెంటనే వదిలేయాలని, వాటిని లోపలికి తీసుకోకూడదని పేర్కొంది. 

తాను ఫేస్‌ చేసిన నెగటివ్‌ కామెంట్లపై స్పందిస్తూ, ప్రారంభంలో తనపై చాలా నెగటివ్‌ కామెంట్లు వచ్చాయని, తన లుక్స్ బాగుండవని, కళ్లు బాగుండని డైరెక్టర్లే చెప్పారు. ఆ సమయంలో కాస్త బాధేసింది. అయితే మేకప్‌ వేసుకున్నాక నా కళ్లే హైలైట్‌ అయ్యాయి. భాలేవ్‌ అన్నావాళ్లే, బాగున్నాయని చెప్పారని తెలిపింది. అలాగే తన నడకపై కూడా విమర్శలు వచ్చాయని పేర్కొంది హిమజ. అయితే తన నడక మగరాయుడిలా ఉంటుందని, కానీ అమ్మాయిలా ఎలా నడవాలో చెబితే నడుస్తామని వెల్లడించింది. 

సోషల్‌ మీడియాలో తాను యాక్టివ్‌గా ఉంటానని తెలిపింది. అందులో పాజిటివ్‌, నెగటివ్‌ రెండూ ఉంటాయని, రెండింటిని తీసుకోవాలని తెలిపింది. నెగిటివ్‌ని కూడా భరించాలి. మనకు తెలుసో, తెలియకో ఏదో ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చే నెగిటివ్‌ని కూడా భరించే ఓపిక ఉండాలని చెప్పింది. సోషల్‌ వర్క్ గురించి చెబుతూ, బయట ఏదో చేయడం కంటే ముందు తమ ఇంట్లోనే చేయాల్సి ఉందని, తమ డ్రైవర్‌ పిల్లలను చదివించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పింది. అతనికి ఉన్న ముగ్గురు ఆడపిల్లలను తాను చదివిస్తానని తెలిపింది హిమజ. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో  కంటెస్టెంట్‌గా పాల్గొని ఆకట్టుకుంది నటి హిమజ. `నేను శైలజ`, `ధృవ`, `జనతా గ్యారేజ్`, `వినయ విధేయ రామ`, `వరుడు కావలెను` వంటి చిత్రాలలో మంచి పాత్రలను పోషించింది హిమజ.  

Follow Us:
Download App:
  • android
  • ios