బిగ్ బాస్ ఎఫెక్ట్..హీరోగా గౌతమ్ కృష్ణ రీ ఎంట్రీ.. డాక్టర్ బాబుకు వరుస అవకాశాలు
ఇండస్ట్రీలో కనుమరుగు అయిన స్టార్స్ కు..మళ్లీ హోప్ ఇచ్చే ఏకైక షో బిగ్ బాస్.. కాని బిగ్ బాస్ వల్ల అందరు ఆర్టిస్ట్ లకు పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది. కొందరుమాత్రం మళ్ళీ రీ ఎంట్రీలు ఇస్తూ.. కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా హీరో గౌతమ్ కృష్ణకు కూడా లక్ బాగా కలిసొచ్చింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కలిసిరాక.. కొన్ని సినిమాలు మాత్రమే చేసి.. ఫేమ్ కోసం ఎదరుచూస్తున్న వారు బిగ్ బాస్ లోకి వెళ్ళి లక్కును పరీక్షించుకుంటున్నారు. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లి చాలామంది స్టార్ స్టేటస్ ని అందుకుంటారు. ఇక అక్కడ వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకొని సినిమాల్లో రాణించాలని ఆశ పడుతుంటారు. కాని బిగ్ బాస్ హౌస్ లోకి కోటి ఆశలతో వెళ్లిన చాలామందికి నిరాశే ఎదురవుతున్నపరిస్థితి. చాలా మంది అసలు బిగ్ బాస్ లోకి వెళ్లి.. అప్పటి వరకూ ఉన్న ఆ కాస్త ఫామ్ ను కూడా కోల్పోయిన వారు ఉన్నారు.
ఈఫార్ములాను ప్రయత్నించిన చాలామంది బోల్తా పడ్డారు. అందులో యాక్టర్ సామ్రాట్, తనిష్, శివబాలాజీ, సంపూర్ణేష్ బాబు, వరుణ్ సంతేష్, యాంకర్ రవి, లాంటి వారు అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియలేదు. కాని అదే టైమ్ లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, దీప్తి సునైన, సిరి హనుమంత్, సోహెల్, సన్నీ లాంటివారు మాత్రం తమ ఫామ్ ను కొనసాగిస్తూ.. మంచి మంచి ఆపర్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆ లిస్ట్ లోనే చేరాడు హీరో గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా... విన్నర్ కూడా సాధించలేని అవకాశాలు గౌతమ్ ను వరిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గోన్న గౌతమ్ కృష్ణ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో సినిమాలు చేసిన గౌతమ్ కు ఏ సినిమా కలిసి రాలేదు. దాంతో బిగ్ బాస్ కు వచ్చిన తరువాత తాజాగా ఓ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ.. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సోలో బాయ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా త్వారా నవీన్ కుమార్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.
సెవెన్ హిల్స్ బ్యానర్ పై సతీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జుడా సందే సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. అదే బిగ్ బాస్ షోలో గౌతమ్ తో కలిసి కంటెస్టెంట్ గా ఉన్న ఆట సందీప్.. ఈ సినిమాలో అన్ని పాటలకు కోరియోగ్రఫీ చేయబోతున్నారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆనంద్ చక్రపాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.