తెలుగులో చిన్నా చితకా సినిమాలు చేసిన బిందు మాధవి... బిగ్ బాస్ టైటిల్ అందుకొని వెలుగులోకొచ్చింది. దీంతో ఆమెకు సంబంధించిన విషయాలపై జనాలు ఆసక్తి చూపుతున్నారు. బిందు మాధవి పెళ్లిపై తండ్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Big boss Nonstop) గ్రాండ్ ఫైనల్ ఇటీవల ముగిసింది. బిగ్ బాస్ టైటిల్ తెలుగు హీరోయిన్ బిందు మాధవి అందుకున్నారు. ఉత్కంఠ పోరులో అఖిల్ సార్థక్ కి ఝలక్ ఇస్తూ బిందు విజేతగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగులో టైటిల్ అందుకున్న ఫస్ట్ లేడీగా రికార్డులకు ఎక్కారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ తో పాటు రూ. 40 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో బిందు మాధవి ఫాదర్ ని సాక్షి మీడియా ఇంటర్వ్యూ చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే బిందు మాధవి పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు.
చదువు పూర్తయ్యాక బిందు మాధవికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను. ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్స్, అమెరికాలో స్థిరపడిన ఉన్నతమైన కుటుంబాల నుండి సంబంధాలు వచ్చాయి. నేను ఎంత ఒత్తిడి చేసినా బిందు పెళ్ళికి ఒప్పుకోలేదు. అప్పుడు నాకు చాలా బాధేసింది. సినిమాల్లోకి వచ్చాక కూడా నా ప్రయత్నాలు ఆపలేదు. నేను చిన్నపిల్లను కాను, నా సంగతి నేను చూసుకుంటాను. ఏది మంచి ఏది చెడు అని నాకు తెలుసు. నేను కోరుకున్నప్పుడు నాకు పెళ్ళి చేయండి అంది. ఈ రోజుల్లో పిల్లల ఆలోచనలు మారిపోయాయి. అందుకే నేను ఆమె నిర్ణయాన్ని గౌరవించాను.. అంటూ బిందు మాధవి తండ్రి తెలియజేశారు.
ఆయన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అని సమాచారం. 2008లో విడుదలైన ఆవకాయ్ బిర్యానీ మూవీతో బిందు (Bindu Madhavi) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా తెరకెక్కిన బంపర్ ఆఫర్ ఆమెకు గుర్తింపు తెచ్చింది. అయినప్పటికీ తెలుగులో ఆమెకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. తమిళంలో 15 చిత్రాల వరకు బిందు మాధవి చేశారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.
కమల్ హాసన్ వ్యాఖ్యాతగా 2017లో ప్రసారమైన బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 లో బిందు మాధవి పాల్గొన్నారు. ఫైనల్ కి చేరిన బిందు మాధవి 4వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ అనుభవంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ పట్టేశారు. మరి ఇప్పుడైనా తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి. కానీ అది చాల కష్టమే. ఈ మధ్య కాలంలో ఒక్క తెలుగు అమ్మాయిగా కూడా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేదు. ఈ కారణంగానే అంజలి, శ్రీ దివ్య లాంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ కి వలస వెళ్లి సక్సెస్ అయ్యారు.
