బాగ్ బాస్ ఫేమ్ అర్జున సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. భార్య సురేఖ నాకు రోజూ చుక్కలు చూపిస్తుందని వాపోయాడు. బిగ్ బాస్ హౌస్లో అందరినీ తన చూపులతో భయపెట్టిన అర్జున్... భార్యకు భయపడటం ఏంటని జనాలు షాక్ అవుతున్నారు.
నటుడు అర్జున్ అంబటి బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ సాధించారు. సీజన్ 7లో అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఐదు వారాల అనంతరం హౌస్లో అడుగుపెట్టిన అర్జున్ సత్తా చాటాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళాడు. వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు హౌస్లో అడుగుపెట్టగా... అర్జున్ మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు. టాప్ 6లో అర్జున్ నిలిచాడు.
బిగ్ బాస్ షో కారణంగా అర్జున్ కి ఒక క్రేజీ ఆఫర్ కూడా వచ్చింది. రామ్ చరణ్-బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కనున్న మూవీలో అర్జున్ అంబటికి ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని బుచ్చిబాబు సానా స్వయంగా తెలియజేశాడు. ఆరడుగుల ఎత్తు, ఆహార్యంతో గంభీరంగా కనిపించే అర్జున్ ని ఆయన భార్య భయపెడుతుందట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశాడు.
నేను ఒక్క చుక్క చూపించిన పాపానికి రోజూ నాకు చుక్కలు చూపిస్తుంది... అని ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశాడు. అయితే ఇదంతా సరదాకు మాత్రమే. ఫిబ్రవరి 21 అర్జున్ పెళ్లి రోజు కాగా... భార్యకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్న ఫోటో షేర్ చేశాడు. సదరు ఫోటోకి పైన చెప్పిన కామెంట్ జోడించాడు. మా ప్రియమైన వివాహ బంధానికి మరొక ఏడాది.. అని సంతోషం వ్యక్తం చేశాడు.
అర్జున్ భార్య పేరు సురేఖ. ఫ్యామిలీ వీక్ లో ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. నిండు గర్భవతిగా ఉన్న సురేఖకు హౌస్లో సీమంతం జరిగింది. ఇటీవల సురేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అర్జున్ అంబటి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
