బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనల్ కి చేరిన కంటెస్టెంట్స్ లో అరియనా ఒకరు. ఫైనలిస్ట్ గా టాప్ ఫైవ్ కి చేరిన అరియనా... నాలుగవ స్థానం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగిన అరియనా జెన్యూన్ ప్లేయర్ అనే పేరు సంపాదించారు. ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అరియనాకు ప్రేక్షకులలో పాపులారిటీ పెంచింది. బోల్డ్ లేడీగా హౌస్ లోకి ఎంటరైన అరియనా.. అవినాష్ తో స్నేహం చేశారు. వీరి మధ్య లవ్ కూడా పుట్టిందని టాక్ రావడం జరిగింది. అయితే వీరిద్దరూ మేము మంచి స్నేహితులం మాత్రమే అని కన్ఫెస్ చేశారు. 

బిగ్ బాస్ షో తరువాత అరియనా పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అరియనా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ కాగా, ఆమెకు కొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అరియనా అనేక ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజీత్ పై ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హౌస్ లో ఉన్న వారందరూ, ఎవరి గేమ్ వాళ్ళు బాగా ఆడారు. అయితే టైటిల్ గెలిచే అదృష్టం ఒక్కరికే దక్కుతుంది. ఆ అదృష్టం అభిజీత్ కి దక్కిందని అరియనా అన్నారు. ఇక హౌస్ లో అభిజీత్ గేమ్ తనకు ఎంతగానో నచిందన్న అరియనా... అతను టైటిల్ గెలవడం ఆనందం ఇచ్చింది అన్నారు. ఇక మరో ఏడాదిలో పెళ్లి చేసుకుంటానన్న అరియనా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడంలోనే సంతోషం ఉందని అన్నారు.