హీనా ఖాన్ తండ్రి హఠాన్మరణం పొందారు. మంగళవారం హీనా తండ్రి గుండెపోటుకు గురయ్యారు. దీనితో ఆయనను సమీప హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  

నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హీనా ఖాన్ తండ్రి హఠాన్మరణం పొందారు. మంగళవారం హీనా తండ్రి గుండెపోటుకు గురయ్యారు. దీనితో ఆయనను సమీప హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి బంధువులు విషయం తెలియజేశారు. తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ హుటాహుటిన ముంబై చేరుకోవడం జరిగింది. హీనా తండ్రి మరణవార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. హీనా ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 


ఇక సీరియల్ నటిగా పాపులారిటీ సంపాదించిన హీనా ఖాన్, బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 11లో పాల్గొన్న హీనా ఖాన్ రన్నర్ గా నిలిచారు. స్మార్ట్ ఫోన్ పేరుతో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ లో నటించారు. అన్లాక్, హ్యాక్డ్ మూవీలో కూడా ఆమె నటించడం జరిగింది. అలాగే పదుల సంఖ్యలో బుల్లితెర సీరియల్స్ లో నటించారు.