హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌14 ఫాలో అయినవారికి అందులో పాల్గొన్న కంటెస్టెంట్‌ నిషాంత్‌ సింగ్‌ మల్ఖానీ గురించి తెలుసు. ఆయన తాజాగా  రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా  స్నేహితులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కి ముంబై నుంచి జైసల్మేర్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్‌ అయ్యింది. కంటెస్టెంట్  ప్రయాణిస్తన్న కారు అదుపుతప్పి మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. అయితే  ఈ ప్రమాదంలో నిషాంత్‌ సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే నిషాంత్‌ ప్రయాణిస్తున్న వాహనం మాత్రం పూర్తిగా డ్యామేజ్‌  అయ్యింది.

ఈ విషయమై నిషాంత్ మాట్లాడుతూ...'కొత్త ఏడాదిలో అంతా మంచే  జరిగింది. మేం ప్రయాణిస్తున్న వాహనం తప్ప అందరం క్షేమంగా బయటపడిగలిగాం' అంటూ నిషాంత్‌ ట్వీట్‌ చేశాడు. ప్రమాదం జరిగిన రోజు సహాయం కోసం రోడ్డుపై పరిగెత్తానని, కానీ ఎవరూ హెల్ప్‌ చేయలేదని వాపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా కారును క్రేన్‌ సహాయంతో తొలిగించామని, క్షేమంగా హోటల్‌ రూంకి చేరుకున్నామని పేర్కొన్నాడు. దేవుని ఆశీస్సుల వల్లే అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ జరగలేదని, , ఇదంతా దేవుని మహిమే అని చెప్పుకొచ్చాడు.