బిగ్ బాస్ సీజన్ 3 పదిహేడు మంది కంటెస్టంట్స్ తో మొదలైతే ప్రస్తుతం పదకొండు మంది కంటెస్టంట్స్ హౌస్ లో మిగిలారు. ఇటీవల షో నుండి ఎలిమినేట్ అయిన హిమజ.. శ్రీముఖిపై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి నామినేషన్స్ అంతా గేమ్ ప్లాన్ 'ప్రకారమే జరుగుతుందని.. శ్రీముఖి హౌస్ నుండి డైరెక్టర్స్‌ని గైడ్ చేస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ అనుకొని వస్తారని కానీ అక్కడ జరిగేది మాత్రం వేరే అని చెప్పింది. శ్రీముఖి అయితే కెమెరాల దగ్గరకు వెళ్లి బిగ్ బాస్ టీంకి సలహాలు, సూచనలు ఇస్తుంటుందని హిమజ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ డైరెక్టర్స్‌లో అభిషేక్ అండ్ శ్యామ్‌లు శ్రీముఖికి బాగా క్లోజ్ అని ఆమె షోలో తనతో చెప్పిందని.. ఓ వైపు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెబుతూ మరోవైపు సలహాలు ఇస్తుంటుందని.. ఈమె యాంకర్‌గా వచ్చిందా? లేక కంటెస్టెంట్‌గా వచ్చిందా అన్న అనుమానం వచ్చిందని చెప్పింది. తన గేమ్ ప్లాన్ తెలిసి ఆశ్చర్యపోయానని.. తను చాలా స్ట్రాంగ్ అని అందరూ అనుకుంటారని కానీ శ్రీముఖి చాలా సెన్సిటివ్ అని హిమజ చెప్పింది.

శివజ్యోతి సెన్సిటివ్ అనుకుంటున్నారు కానీ శ్రీముఖి చాలా సెన్సిటివ్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. తనపై గుడ్డు కొట్టినప్పుడు తెగ ఫీల్ అయిందని.. బాబా భాస్కర్ తనను నామినేట్ చేశారని బాధ పడుతోందని.. అసలు విషయాలు మీకు త్వరలోనే తెలుస్తాయి అంటూ సంచలన కామెంట్స్ చేసింది హిమజ.