Kalasa Movie : ‘కలశ’ మూవీ రివ్యూ.! బిగ్ బాస్ భానుశ్రీ భయపెట్టిందా?

బిగ్ బాస్ భామ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలశ’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల ఎలా ఉందనే విషయాలను రివ్యూ తెలుసుకుందాం.  

Bigg Boss Bhanu Sree Kalasa Movie Review NSK

మూవీ టైటిల్‌: కలశ
తారాగణం: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు
ప్రొడ్యూసర్:  రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం:కొండా రాంబాబు
సినిమాటోగ్రఫీ:వెంకట్‌ గంగధారి
సంగీతం: విజయ్‌ కురాకుల
ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ
రిలీజ్ డేట్: డిసెంబర్‌ 15, 2023

కథ: 

తన్వి (భానుశ్రీ)కి సినిమా డైరెక్టర్ అవ్వాలని కోరిక. దాంతో ఓ హారర్ కథను తయారు చేసుకుని వరంగల్ నుంచి హైద్రాబాద్‌కు వచ్చిన నిర్మాతలను కలుస్తుంటుంది. చివరకు ఓ నిర్మాతకు ఆ కథ నచ్చుతుంది. కానీ ఆ క్లైమాక్స్‌లో కాస్త రియాలిటీ ఎలిమెంట్స్ మిక్స్ చేయమని సలహా ఇస్తాడు. దాంతో ఆమె హైదరాబాద్‌లోని తన స్నేహితురాలు కలశ (సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్లి ఆమె ఇంట్లో ఉండి క్లైమాక్స్ మార్చి మళ్లీ ప్రొడ్యూసర్‌ని కలవాలనుకుంటుంది. అందుకోసం ఆమె కలశకు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లమని చెబుతుంది. తన చెల్లెలు అన్షు (రోషిణి) ఉంటుందని కూడా చెబుతుంది. ఇంటికెళ్లిన తన్వికి ఇంట్లో ఎవరో ఉన్నట్లు, దెయ్యాలు తన వెంటపడుతున్నట్లు కలలు వస్తుంటాయి. అన్షు మాత్రం కనిపించదు. దీంతో అన్షునే తనను ఆట పట్టిస్తుందని తన్వి అనుకుంటుంది. అదే సమయంలో తన్వి కదలికలను ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా గమనిస్తుంటారు. రాత్రంతా పిచ్చి పిచ్చి కలలతో ఇబ్బందిపడ్డ తన్వికి తెల్లవారగానే షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? అసలు ఇంట్లో ఉన్న కలశ, అన్షు ఏమవుతారు? సిటీలో కనిపించకుండా పోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమ్మాయి ఎవరు? ఆమెకు కలశకు సంబంధం ఏంటి? తన్వి ఫ్రెండ్.. రైటర్ రాహుల్(అనురాగ్)కి కలశకు సంబంధం ఏంటి? తన్విని సీక్రెట్‌గా ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు? చివరకు తన్వి కల ఏం అవుతుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ డైరెక్టర్‌ అవ్వాలనే పాత్రలో తన్విగా ఆమె చక్కగా నటించింది. తెరపై  కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక కలశ పాత్రలో నటించిన సోనాక్షి వర్మ.. చుట్టూనే సెకండాఫ్ ప్రధానంగా నడుస్తుంది. అన్షు రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా సమీర్‌, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన పాత్రలన్నీ తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ: 
ప్రస్తుతం హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లు ఎక్కువగా క్లిక్ అవుతుంటాయి. ఈ కలశను కూడా మంచి హారర్ థ్రిల్లర్‌గా మలచాలని దర్శకుడు ప్రయత్నించాడు. రొటీన్ హారర్ మూవీగానే దర్శకుడు స్టార్ట్ చేశారు. ఇంటర్వెల్ వరకు సినిమా అలాగే ఊహకందేలా, ఇది వరకు ఎన్నో సార్లు చూసిన సినిమాలనే సాగుతుంది. అయితే ఇంటర్వెల్ నుంచి ట్రీట్‌మెంట్ మారిపోయింది. హారర్ కోణంలో కాకుండా సైకలాజికల్ హారర్ కోణంలో సాగిపోతుంది. అసలు అప్పటి వరకు జరిగిన సన్నివేశాలకు కారణమైన అంశాలను ఒక్కొక్కటిగా దర్శకుడు రివీల్ చేసిన తీరు బావుంది. 

ఫస్టాఫ్ లో కామెడీ, హారర్ ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. అయితే సినిమాను కాస్త సాగదీసినట్లుగా కూడా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలు లైమ్ లైట్‌లోకి రావటంతో కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కలశ బ్యాగ్రౌండ్, ఆమె చెల్లెలు అన్షు, సిటీలో కనిపించకుండా పోయిన అమ్మాయి, చంపబడ్డ సీఐ .. అన్విత బాయ్ ఫ్రెండ్ ఇలా సినిమా సాగే కొద్ది ఆసక్తి పెరుగుతూ వస్తుది. ఫస్ట్ హాఫ్ సోసోగా సాగితే.. సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. 
 
టెక్నికల్ విషయాలను చూస్తే  విజయ్‌ కురాకుల నేపథ్యం సంగీతం మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ఇలాంటి చిత్రాలకు కెమెరా వర్క్ ఇంపార్టెంట్. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా  ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios