పవన్ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎమోషనల్ నోట్..
శుభ శ్రీ.. అనూహ్యంగా ఐదో వారంలో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ సినిమా ఆఫర్‌ని దక్కించుకుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది.

చాలా మంది సినీ ప్రియులకు, సినిమాల్లోకి రావాలనుకునే వారికి పవన్ తో పనిచేయాలని కలలు కంటుంటారు. అలాంటి అవకాశం రావడం చాలా అరుదు. వస్తే ఆ ఆనందానికి అవదులు ఉండవని చెప్పొచ్చు. అలాంటి ఆనందంలో ఉంది బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ రాయగురు. ఆమె ఇటీవల `బిగ్ బాస్ తెలుగు 7` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కూల్ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటుంది. హాట్ అందాలతో అలరించింది.
అనూహ్యంగా ఐదో వారంలో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ సినిమా ఆఫర్‌ని దక్కించుకుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. పవర్ స్టార్ హీరోగా రూపొందుతున్న `ఓజీ`లో ఆమెకి నటించే అవకాశం రావడం విశేషం. ఈ విషయాన్ని శుభ శ్రీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దర్శకుడు సుజిత్‌తో కలిసి దిగిన ఫోటోని పంచుకుంటూ తన సంతోషాన్ని వెల్లడించింది.
పవన్ కళ్యాణ్‌తో కలిసి `ఓజీ` మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది శుభ శ్రీ. తాను పక్కా పవర్ స్టార్ ఫ్యాన్ ని అని, తాను చాలా సంతోషంగా ఉందని తెలిపింది. నా టాలెంట్‌ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన సుజీత్, కెమెరామెన్ రవిచంద్రన్, డీవీవీ దానయ్యలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇంతగా తనని ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది శుభ శ్రీ.
శుభ శ్రీ `బిగ్ బాస్ తెలుగు 7`లో.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా రాణించింది. ఆమె ఆట తీరు అందరిని ఆకట్టుకుంది. తాను ఆటలో పుంజుకుంటున్న సమయంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇప్పుడు పవన్ సినిమాలో ఛాన్స్ రావడంతో, ఏం జరిగినా మన మంచికే అని అభినందిస్తున్నారు ఫ్యాన్స్.