పెద్ది సినిమాపై అర్జున్ అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం జాతీయ అవార్డ్ గెలిచే చిత్రం అవుతుందన్నారు.  

రాంచరణ్ పెద్ది మూవీపై భారీ అంచనాలు 

టాలీవుడ్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పెద్ది ఒకటి. 'ఉప్పెన' సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు బుచిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా షూటింగ్ జరుగుతోంది.

పెద్ది చిత్రంలో అర్జున్ అంబటి 

ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్, పెద్ది గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "టీజర్ విడుదలైన తర్వాత చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగిన విధంగా బుచిబాబు మరింత కష్టపడుతున్నారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అవుతుంది. కథలోని ఎమోషనల్ డ్రామా అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు జాతీయ అవార్డు కూడా అందుకుంటుంది" అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తుండగా, లెజెండ్రీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన లభించగా, సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ అందరిలో అంచనాలు పెంచేశాయి. 

ఇప్పటివరకు మూవీ కథ, పాత్రల వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. కానీ బుచిబాబు గత సినిమాకు జాతీయ అవార్డు రావడంతో,పెద్ది పై కూడా సరికొత్త ఆసక్తి నెలకొంది.