బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్, రాంచరణ్ మూవీలో ఛాన్స్.. వేదికపైనే ప్రకటించిన బుచ్చిబాబు
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా కలర్ ఫుల్ హంగామా సాగుతోంది. ఆదివారం రోజు దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో సెలెబ్రేషన్స్ నిర్వహించారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా కలర్ ఫుల్ హంగామా సాగుతోంది. ఆదివారం రోజు దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో సెలెబ్రేషన్స్ నిర్వహించారు. స్పెషల్ ఈవెంట్ కోసం కొందరు అతిథులు కూడా హాజరయ్యారు.
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. బిగ్ బాస్ 7లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన ఓ కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్ దక్కింది. ఉప్పెన చిత్రంతో బుచ్చిబాబు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ వేదికపైకి అతిథిగా వచ్చిన బుచ్చిబాబు నాగార్జునతో కలసి సరదాగా మాట్లాడారు. ఉప్పెన చిత్రానికి నేషనల్ అవార్డు రావడంతో నాగ్ బుచ్చిబాబుని అభినందించారు. ఇంతలో హౌస్ నుంచి అర్జున్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు అన్న మీకోసం రెండుసార్లు ఆఫీస్ కి వచ్చాను. మీరు చెన్నై వెళ్లారు అని చెప్పారు.
ఇంతలో బుచ్చిబాబు సమాధానం ఇస్తూ.. అర్జున్ నువ్వు రాంచరణ్ గారి సినిమాలో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని ప్రకటించేశాడు. దీనితో అర్జున్ థ్యాంక్యూ అన్న అంటూ ఎగిరి గంతేశాడు. ఆ విధంగా హౌస్ లో ఉన్న అర్జున్ కి బంపర్ ఆఫర్ తగిలింది. అర్జున్ దీపావళి సెలెబ్రేషన్స్ రెట్టింపు అయ్యాయి. అర్జున్ ఆటతీరుని కూడా బుచ్చిబాబు మెచ్చుకున్నారు.
అర్జున్ తనని కలవడానికి వచ్చినప్పుడు తాను చెన్నైకి వెళ్లానని బుచ్చిబాబు అన్నారు. పక్కనే ఉన్న నాగ్ బుచ్చిబాబు చెన్నైకి ఎందుకు వెళ్లారో తెలుసా అని అడిగారు ?ఏఆర్ రెహమాన్ కి కథ చెప్పడానికి వెళ్లారు అని నాగ్ అన్నారు. అవును ఈ చిత్రానికి రెహమాన్ గారు వర్క్ చేస్తున్నారు అని బుచ్చిబాబు కంఫర్మ్ చేశారు.