అయోధ్యలో నిర్మించిన రామ మందిరం నిర్మాణం పూర్తి అయ్యింది. త్వరలో ప్రారంభం కానుంది. రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం విరాళాలు సేకరిస్తూ ఉండగా బిగ్ బాస్ ఆదిరెడ్డికు డొనేట్ చేశారు.  


హిందువులు అమితంగా ఆరాధించే శ్రీరాముని ఆలయం అయోధ్యలో నిర్మితమైంది. ఈ నెల 22న అతిరథమహారథుల సమక్షంలో ప్రారంభం కానుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం దక్కింది. టాలీవుడ్ నుండి చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఉన్నారు. కాగా రామ మందిర నిర్మాణంలో దేశ ప్రజలను భాగస్వాములు చేయాలని విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. 

బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి భారీ మొత్తంలో రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చారు. ఆయన లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్నీ ఆధారాలతో సహా ఆదిరెడ్డి తన ఫాలోయర్స్ కి తెలియజేశాడు. తానూ, తన కుటుంబం, తన ఫాలోవర్స్, ఆయన వ్యాపారంతో పాటు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రామ మందిర నిర్మాణానికి రూ. 1 లక్ష దానం చేసినట్లు ఆయన తెలియజేశాడు. 

ఒక యూట్యూబర్ లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. బిగ్ బాస్ షో రివ్యూవర్ గా ఆదిరెడ్డి లక్షల సంపాదన కలిగి ఉన్నారు. తనకు యూట్యూబ్ ద్వారా నెలకు రూ. 39 లక్షల వరకు వస్తున్నట్లు ఇటీవల ఓపెన్ గా ప్రకటించాడు. ఆధారాలు కూడా చూపించాడు. ఆదిరెడ్డి విజయవాడలో జావేద్ హబీబ్ పేరుతో హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ నడుపుతున్నాడు. అది కూడా ఆదాయమార్గంగా ఉంది. ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న విషయం తెలిసిందే. 

View post on Instagram