హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి కారణమయ్యాడన్న అభియోగాలపై అరెస్ట్ అయిన బిగ్‌బాస్ 7 తెలుగు టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‌కు ఎట్టకేలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి కారణమయ్యాడన్న అభియోగాలపై అరెస్ట్ అయిన బిగ్‌బాస్ 7 తెలుగు టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‌కు ఎట్టకేలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్ట్ తీర్పు వెలువరించింది. 

కాగా.. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీనితో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ఈ అల్లర్లని ఆపడంతో పోలీసులకు ప్రశాంత్ సహకరించలేదనే ఆరోపణ ఉంది. పల్లవి ప్రశాంత్ తన అభిమానులని రెచ్చగొట్టే విధంగా వ్యహరించడంతో ఈ దాడులు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించింది.

పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొందరు సృష్టించిన అల్లర్లలో బిగ్ బాస్ సెలబ్రిటీల వాహనాలు, బస్సులు ధ్వంసం అయ్యాయి. అమర్ దీప్ కారుపై అటాక్ చేశారు. లోపల వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుంటే ఎలా అంటూ ప్రియాంక ఫైర్ అయింది. హౌస్ లో మేము కేవలం టాస్కుల్లో మాత్రమే గొడవ పడతాం. మిగిలిన టైంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అని ప్రియాంక తెలిపింది. 

పల్లవి ప్రశాంత్ లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచాడనే సంతోషం లేకుండా పోయింది అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తీరుని తప్పుబడుతూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు పల్లవి ప్రశాంత్ కి మద్దతు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ అతివల్లే ప్రశాంత్ ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు అని అంటున్నారు. అయితే ప్రశాంత్ అరెస్ట్ పై ఇప్పటికే చాలా మంది స్పందించారు.

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో అతనిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు మైనర్లు వుండగా.. మిగిలిన 12 మందికి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. బిగ్‌బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఫైనల్ ముగిసిన తర్వాత విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రశాంత్.. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీగా వెళ్లాడని, రోడ్డుపై వాహనాలు ఆపాడాని అభియోగాలు నమోదు చేశారు. అన్నపూర్ణ స్టూడియో మెయిన్ గేట్ నుంచి రావొద్దని చెప్పినా ప్రశాంత్ రావడం వల్లే అక్కడ పరిస్ధితి కంట్రోల్ తప్పిందని పోలీసులు వెల్లడించారు.