తేజ పిచ్చి చేష్టలు, గౌతమ్ మెడకు బెల్ట్ కట్టి లాగిన వైనం.. వణుకు పుట్టించిన టాస్క్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బుధవారం ఆసక్తికరంగా సాగింది. నాల్గవ పవర్ అస్త్ర పోటీలో కంటెండర్లుగా అర్హత సాధించడం కోసం కాయిన్స్ టాస్క్ నిర్వహించారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బుధవారం ఆసక్తికరంగా సాగింది. నాల్గవ పవర్ అస్త్ర పోటీలో కంటెండర్లుగా అర్హత సాధించడం కోసం కాయిన్స్ టాస్క్ నిర్వహించారు. ఈ కాయిన్స్ టాస్క్ లో శివాజీ, సందీప్, శోభా శెట్టి బ్యాంకర్లుగా వ్యవహరించారు. ఒక్కో బ్యాంకర్ వద్ద పదివేల విలువ చేసే కాయిన్స్ ఉంటాయి. ఒక్కో కాయిన్ విలువ 100 గా ఉంటుంది.
బ్యాంకర్లు ఆ కాయిన్స్ ని ఇతర సభ్యులకు ఇవ్వాలి. అలా కాయిన్స్ మొత్తం ఇతర సభ్యులకు వెళతాయి. ఇతర సభ్యులు ఆ కైన్స్ ని ఎవరి బ్యాంకులో వారు దాచుకోవాలి. ఇందులో తేజ 51, రాతిక 35, గౌతమ్ 24, ప్రియాంక 41, శుభ శ్రీ 31, ప్రశాంత్ 33, అమర్ 41, యావర్ 43 కాయిన్స్ పొందారు.
ఆ తర్వాత అసలైన పోటీ మొదలయింది. బిగ్ బాస్ చెప్పగానే ఇతర ఇంటి సభ్యులు బజర్ నొక్కేందుకు పోటీ పడాలి. ఆ విధంగా ముందుగా అమర్ డీప్ బజర్ నొక్కాడు. ఈ పోటీలో ముందుగా బజర్ నొక్కినా వ్యక్తి తన పార్ట్నర్ ని ఎంచుకోవాలి. అలాగే ఇద్దరు పోటీ దారులని కూడా ఎంపిక చేసుకోవాలి. పార్ట్నర్ గా గౌతమ్ ని.. పోటీ దారులుగా రతిక, తేజ లని అమర్ డీప్ ఎంపిక చేసుకున్నాడు.
తదుపరి లెవల్ లో అమర్ దీప్, గౌతమ్ జంట.. తేజ, రతిక జంట మధ్య పోటీ జరుగుతుంది. ఒక జంట శివాజీ వద్ద ఉన్న కెమెరా వద్దకు వేలి స్మైలీ ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగాలి. మరో జంట వారిని ఫోటోలు దిగకుండా అడ్డుకోవాలి. ఎవరు ఎక్కువ ఫోటోలు దిగితే ఆ జంట విజేత. ఫోటోలు దిగడానికి ప్రయత్నించే జంట నడుముకి బెల్ట్ కడతారు. ఆ బెల్ట్ ని పట్టుకుని మాత్రమే మరో జంట వారిని అడ్డుకోవాల్సి ఉంటుంది.
ఈ పోటీలో అమర్ దీప్, గౌతమ్ జంట ఎక్కువ ఫొటోలతో విజేతలుగా నిలిచారు. గౌతమ్ ఫోటోలకోసం ప్రయత్నిస్తున్నప్పుడు తేజ అతడిని అడ్డుకునే క్రమంలో మెడకు బెల్ట్ వేసి లాగాడు. తేజ చర్యకు ఇతర సభ్యురాలు భయబ్రాంతులకు గురయ్యారు. గేమ్ పూర్తయ్యాక ఆ విధంగా మెడకు బెల్ట్ వేయడం ఏంటి.. అంటూ తేజని మందలించారు. ఓడిపోయిన వారు వారి కాయిన్స్ ని ఆట ప్రకారం గెలిచిన వారికి ఇచ్చేయాలి. దీనితో రతిక, తేజ తమ వద్ద ఉన్న కాయిన్స్ పూర్తిగా కోల్పోయారు. గేమ్ మొత్తం పూర్తయ్యే సరికి ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్ ఉంటే వారే విజేత. గురువారం కూడా ఈ గేమ్ కొనసాగనుంది.