Asianet News TeluguAsianet News Telugu

ప్రమాదానికి గురైన బిగ్ బాస్ 6 విన్నర్ ఊర్వశి ధోలాకియా ప్రయాణిస్తున్న కారు..

బిగ్‌ బాస్ సీజన్ 6 విన్నర్‌, ప్రముఖ టీవీ నటి ఊర్వశి ధోలాకియా ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. ముంబైలో ఊర్వశి షూటింగ్ కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Bigg Boss 6 winner and television actor Urvashi Dholakia meets with car accident
Author
First Published Feb 5, 2023, 10:26 AM IST

బిగ్‌ బాస్ సీజన్ 6 విన్నర్‌, ప్రముఖ టీవీ నటి ఊర్వశి ధోలాకియా ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. ముంబైలో ఊర్వశి షూటింగ్ కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. ఊర్వశి షూటింగ్ కోసం మీరా రోడ్ ఫిల్మ్ స్టూడియోకి వెళ్తున్నారు. అయితే కాశీమీరా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనకాల నుంచి పిల్లలతో వెళ్తున్న స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఊర్వశి సురక్షితంగా బయటపడింది. 

ఈ ఘటనకు సంబంధించి ఊర్వశి పోలీసు స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదంగా మాత్రమే దీనిని భావించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనకు సంబందించి ఊర్వశి కారు డ్రైవర్‌ వాంగ్మూలాన్ని కాశీమీరా పోలీసులు నమోదు చేశారు. ఊర్వశి ధోలాకియా ప్రముఖ టెలివిజన్ షో ‘‘కసౌతి జిందగీ కే‘‘లో కొమొలికా పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా కూడా నిలిచారు. 

ఊర్వశి చిన్న వయస్సులోనే నటనా రంగంలోకి ప్రవేశించారు. దేఖ్ భాయ్ దేఖ్, శక్తిమాన్, కభీ సౌతాన్ కభీ సహేలి, తుమ్ బిన్ జావూన్ కహాన్, కహిన్ తో హోగా, బైతాబ్ దిల్ కీ తమన్నా హై, చంద్రకాంత - ఏక్ మాయావి ప్రేమ్ గాథ వంటి అనేక టీవీ షోలలో నటించారు. అయితే ఏక్తా కపూర్ ‘‘కసౌతి జిందగీ కే’’లో ఆమె బాంగ్ బ్యూటీ కొమొలికా మజుందార్ పాత్ర పోషించడం వల్ల ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios