Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: ఎక్కడ నెగ్గాలో కాదు, తగ్గాలో తెలిసిన శ్రీహాన్‌.. కీర్తి ఇప్పుడు ఒక్కరు కాదు..

నేడు బుధవారం ఎపిసోడ్‌లో శ్రీహాన్‌, కీర్తిలకు స్వాగతం పలుకుతూ వారి జర్నీలు చూపించారు. ఇద్దరివి రెండు విభిన్నమైన జర్నీలు కావడం విశేషం. శ్రీహాన్‌ది కామెడీగా,ఫన్నీగా సాగితే, కీర్తిది చాలా ఎమోషనల్‌గా సాగడం విశేషం. దీంతో గుండెల్ని బరువెక్కించింది.

bigg boss 6 telugu grand welcome to srihan and keerthi one funny journey another emotional journey
Author
First Published Dec 14, 2022, 11:40 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6 ముగింపుకి రోజులు దగ్గరపడే కొద్ది మరింత ఎమోషనల్‌గా మారిపోతుంది. గ్రాండ్‌ ఫినాలే కోసం ఈ సారి అనూహ్యంగా ఆరుగురు ఫైనల్‌ అయ్యారు. వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు బిగ్‌ బాస్‌. ఫినాలే కోసం అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వారి జర్నీలను చూపిస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌, శ్రీ సత్య, ఆదిరెడ్డి, రోహిత్ లకు స్వాగతం పలికారు బిగ్‌బాస్‌. 

నేడు బుధవారం ఎపిసోడ్‌లో శ్రీహాన్‌, కీర్తిలకు స్వాగతం పలుకుతూ వారి జర్నీలు చూపించారు. ఇద్దరివి రెండు విభిన్నమైన జర్నీలు కావడం విశేషం. శ్రీహాన్‌ది కామెడీగా,ఫన్నీగా సాగితే, కీర్తిది చాలా ఎమోషనల్‌గా సాగడం విశేషం. దీంతో గుండెల్ని బరువెక్కించింది. ఆద్యంతం ఎమోషనల్‌గా మార్చింది. తమ గురించి బిగ్‌ బాస్‌ వర్ణించిన తీరుని చూసి, ఆ మాటలకు వారు భావోద్వేగానికి గురయ్యారు. జర్నీలు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

మొదట శ్రీహాన్‌ గురించి చెబుతూ, బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎన్నో భావోద్వేగాల సమాహారం అని తెలిపారు. అందరితోనూ బాగా ఉంటూ, అవసరమైనప్పుడు పోటీ పడుతూ, నవ్వులు పంచుతూ మాటలతోనే కాదు, చేష్టలతోనూ అలరించావన్నారు బిగ్‌ బాస్‌. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసివారు శ్రీహాన్‌, స్నేహం కోసం తగ్గిన తీరుని అభినందించారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని, అవసరమైనప్పుడు స్నేహంపై కూడా పోరాడి టికెట్‌ టూ ఫినాలే సాధించావన్నారు. 

చిన్న చిన్న పొరపాట్ల వల్ల రెండు సార్లు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయవని తెలిపారు. పట్టుకోవడంలోనే కాదు, వదిలేయడంలోనూ బలం ఉంటుందని నిరూపించావని చెప్పారు బిగ్‌ బాస్‌. ఈ సందర్భంగా బిగ్‌ బాస్‌ చెప్పిన తీరుకి ఫిదా అయిన శ్రీహాన్‌,.. తనని చాలా బాగా అర్థం చేసుకున్నారని, తనని ఎవరూ గుర్తించడం లేదనే ఫీలింగ్ ఉండేదని, మీరు గుర్తించారని ఆనందం వ్యక్తంచేశారు శ్రీహాన్‌. ఈ సందర్భంగా ఆయనకు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. 

అనంతరం కీర్తి వంతు వచ్చింది. ఆమె గురించి చాలా ఎమోషనల్ గా చెప్పారు బిగ్‌ బాస్‌. కల్పితాల్లో కంటి నిజ జీవితంలోనే ఎంతో నాటకీయత ఉంటుందన్నారు. కణకణ మండే కొడవలిలా జీవితంపై పోరాడారని, ఎంతో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. అడవిలో మహావృక్షం ఉంటుందని, అది తాను ఒంటరి అని భావిస్తే ఆకాశపు అంచుల్ని తాకలేదన్నారు. మీరు అంతేనని చెప్పారు. మొండి ధైర్యంతో ముందుకు సాగావని, తనని అర్థం చేసుకునే వాళ్లు ఎవరూ లేరని, తనకు కుటుంబం లేదని బాధ పడ్డారని తెలిపారు. చాలా సార్లు మీ కన్నీళ్లు మీ మనసులోని భావాలను దాచలేకపోయాయని వెల్లడించారు. 

సింపతి కోసమే మీ కన్నీళ్లు అంటూ చేసిన కామెంట్లని విని గుండె బరువెక్కిందని, కానీ ఆట ఆడితే గాయం మిమ్మల్ని ఆపలేదని నిరూపించారని, 14 వారాల సుధీర్ఘ ప్రయాణం పూర్తి చేసి ఫైనల్‌కి చేరుకున్నారని, ఇప్పుడు మీరు ఒక్కరు కాదని, మీ కుటుంబంలో లక్షల మంది ఉన్నారని తెలిపారు. దీనికి కీర్తి ఎమోషనల్‌ అయ్యింది. తనకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు తమ పేరెంట్స్ ఆత్మ శాంతిస్తుందని, ఇన్నాళ్లు తన కూతురు బాధ పడుతుందని, వాళ్లు ఏడుస్తూ ఉంటారని, ఇప్పుడు ఈ ఆనందం చూసి వాళ్లు శాంతిస్తారని పేర్కొంది. 

ఈ క్రమంలో తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆడియెన్స్ కి, బిగ్‌ బాస్‌కి థ్యాంక్స్ చెప్పింది కీర్తి. ఈ జర్నీ మర్చిపోలేనని వెల్లడించారు. వారికి ఎప్పటికీ రుణ పడి ఉంటానని చెప్పింది. తాను నల్లగా ఉన్నానని రిజక్ట్ చేసిన వారికి, పనికిరావు అన్న వారికి ఇప్పుడు చెబుతున్నా ఇది కీర్తి, నేను కీర్తి. ఇదే కీర్తి అంటూ తనదైన స్టయిల్‌లో ఫినిషింగ్‌టచ్‌ ఇచ్చింది కీర్తి. 

Follow Us:
Download App:
  • android
  • ios