బిగ్‌ బాస్‌ 6 తెలుగులో షో పదకొండో వారంలో మాత్రం ఆ పస కనిపించలేదు. ఏదో మొక్కుబడి నామినేషన్లే కనిపించాయి. ఒకరిద్దరి విషయంలో తప్ప మిగిలిన వారంతా తమ నామినేషన్లు మొక్కుబడిగా వేసినట్టుగానే ఉంది. 

బిగ్‌ బాస్‌ షోలో నామినేషన్ల ప్రక్రియ అంటే రసవత్తరంగా సాగుతుంది. గేమ్‌లలోనూ ఎలాగూ అంత పస ఉండటం లేదు. కనీసం నామినేషన్ల సమయంలోనూ అది ఉండాలని ఆడియెన్స్ ఆశిస్తారు. అందుకోసం వెయిట్‌ చేస్తుంటారు. కానీ బిగ్‌ బాస్‌ 6 తెలుగులో షో పదకొండో వారంలో మాత్రం ఆ పస కనిపించలేదు. ఏదో మొక్కుబడి నామినేషన్లే కనిపించాయి. ఒకరిద్దరి విషయంలో తప్ప మిగిలిన వారంతా తమ నామినేషన్లు మొక్కుబడిగా వేసినట్టుగానే ఉంది. 

బిగ్‌ బాస్‌ 6 తెలుగు షో పది వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. పదో వారంలో ఊహంచని విధంగా ఇద్దరిని ఎలిమినేట్‌ చేశారు నాగార్జున. శనివారం బాలాదిత్యని, ఆదివారం వాసంతిలను ఇంటికి పంపించేశాడు. గేమ్‌ ల విషయంలో హౌజ్‌లో సందడి చేయడం విషయంలోనూ ఈ ఇద్దరు చాలా వీక్‌గా ఉన్న నేపథ్యంలో వారిద్దరిని పంపించారు. దీంతో ఇప్పుడు హౌజ్‌లో పది మంది ఉన్నారు. రేవంత్‌, శ్రీహాన్‌, శ్రీ సత్య, ఇనయ, ఫైమా,రోహిత్‌, మేరినా, రాజ్‌, ఆదిరెడ్డి, కీర్తి ఉన్నారు. టాప్‌ 10 కంటెస్టెంట్లుగా నిలిచారు. 

ఇక బిగ్‌ బాస్‌ షో పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ జరిగింది. మొదట తనకు దగ్గరవుతున్న వారంతా ఎలిమినేట్‌ అవుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఫైమా కెప్టెన్‌ కావడం వల్ల ఆమెని నామినేట్‌ చేయడానికి లేదు. ఫైమా రోహిత్‌, ఇనయలాను నామినేట్‌ చేసింది. ఇనయ మొదట టఫ్‌ ఇచ్చిందని, ఇప్పుడు తగ్గిందని, ఊరికే కోపానికి గురవుతుందని తెలిపింది. 

ఆదిరెడ్డి.. శ్రీహాన్‌, రోహిత్‌లను నామినేట్‌ చేశాడు. పాము గేమ్‌లో మాట్లాడిన చోట మాట్లాడలేదని, అవసరం లేనిచోట మాట్లాడావని చెబుతూ రోహిత్‌ని నామినేట్‌ చేశాడు. ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్‌లను నామినేట్‌ చేసింది. ఇందులో ఆదిరెడ్డికి చెప్పిన కారణం విని అతను షాక్‌ అయ్యాడు. నాకు పిచ్చెక్కిపోతుందని మళ్లీ కింద పడ్డ చెత్తని తీసుకుని తలపై పోసుకున్నాడు. రాజ్‌తోనూ కాసేపు గట్టి వాగ్వాదమే జరిగింది. శ్రీహాన్‌ .. రోహిత్‌, కీర్తిలను నామినేట్‌ చేశాడు. రోహిత్‌ని తన్నిన సంఘటను గుర్తు చేస్తూ, కీర్తిని కెప్టెన్సీ టాస్క్ లో అంతా సపోర్ట్ చేస్తుంటే చివర్లో తప్పుకుని డిజప్పాయింట్‌ చేశావని తెలిపాడు. 

మెరినా.. రేవంత్‌, ఇనయలను నామినేట్‌ చేసింది. సంచాలక్‌ గా సరిగా చెప్పలేదని రేవంత్‌ని, గేమ్‌ తక్కువగా ఆడుతుందని ఇనయని నామినేట్‌ చేసింది. రాజ్‌.. మెరినా, ఇనయాలను నామినేట్‌ చేశాడు. కంటెండర్‌టాస్క్ లో సరిగా ఆడలేదని మెరినానీ, అలాగే తనపై నామినేట్‌ చేసిన ఇనయకి వివరణ ఇస్తూ మళ్లీ ఆమెని నామినేట్‌ చేశాడు రాజ్‌. శ్రీసత్య.. ఇనయ, కీర్తిలను నామినేట్‌చేసింది. రోహిత్‌.. రేవంత్‌, ఆదిరెడ్డిలను నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కీర్తి.. శ్రీ సత్య, మెరినాలను, రేవంత్‌.. రోహిత్‌, మెరినాలను నామినేట్‌ చేశాడు. 

ఇక మొత్తంగా పదకొండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో ఇనయ, రోహిత్‌, మెరినా, ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్‌, శ్రీ సత్య, శ్రీహాన్‌, రాజ్‌ నామినేట్‌ అయ్యారు. మరి వీరిలో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారనేది చూడాలి. ఈ నామినేషన్ల ప్రక్రియ సప్పగా సాగడం గమనార్హం.