Asianet News TeluguAsianet News Telugu

వేలు చూపిస్తూ రేవంత్ కి వార్నింగ్ ఇచ్చిన ఆరోహి.. చిన్న పోటీ కాస్త పెద్ద రచ్చగా..

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం ముగియక ముందే రసవత్తరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య వాడి వేడిగా గొడవలు, మాటల యుద్ధం మొదలైపోయాయి.

bigg boss 6 day 4 became revanth vs Arohi
Author
First Published Sep 8, 2022, 11:34 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం ముగియక ముందే రసవత్తరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య వాడి వేడిగా గొడవలు, మాటల యుద్ధం మొదలైపోయాయి. హౌస్ లో నాల్గవ రోజు రసవత్తర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

మెరీనా ప్రసంగంతో డే 4 మొదలవుతుంది. నామినేషన్స్ గురించి ఇంటి సభ్యులు చర్చించుకుంటూ ఉంటారు. నాల్గవ రోజు గీతూ రాయల్ పెద్ద హంగామానే చేసింది. గలగలా మాట్లాడుతూనే ఉంది. తాను చెప్పే విషయాలకి విలువ ఇవ్వట్లేదు అంటూ గీతూ చిన్నబుచ్చుకోవడంతో చంటి ఇన్వాల్వ్ అవుతాడు. వీరిద్దరి మధ్య చిన్న వివాహం జరుగుతుంది. 

మరోవైపు రేవంత్ కి బాలాదిత్య చిన్నపాటి గీతోపదేశం చేస్తుంటాడు. నామినేషన్స్ లో ఉండడం తప్పు కాదు అని.. ప్రతి వారం ఎవరో ఒకరు నామినేట్ అవుతూనే ఉంటారు అని బాలాదిత్య కాస్త డిప్రెషన్ లో ఉన్న రేవంత్ కి చెబుతాడు. మెరీనా ఇతర లేడీ గ్యాంగ్ కి తన భర్త రోహిత్ పై రొమాంటిక్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటుంది. హౌస్ లోకి వచ్చాక తనకి కనీసం హగ్ కూడా ఇవ్వడం లేదు అని అంటుంది. నిన్న రాత్రి మాత్రం నా బెడ్ షీట్ లో చేయి పెట్టి నా చేతిని పట్టుకున్నాడు. అంతలోనే నిద్రపోయాడు అని నిరాశగా చెబుతుంది. దీనితో మిగిలిన సభ్యులు నవ్వుకుంటారు. 

ఇక మాస్ కేటగిరి లోని సభ్యుల్లో కెప్టెన్సీకి అర్హులు అయ్యే వారి ముగ్గురు పేర్లు చెప్పాలని బిగ్ బాస్ అడుగుతారు. ఆ ముగ్గురిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలని బిగ్ బాస్ చెబుతారు. 

దీనితో ఇంటి సభ్యులు మాస్ కేటగిరిలో కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురిని ఎంపిక చేస్తారు. రోహిత్ అండ్ మెరీనా, ఆర్జే సూర్య, బాలాదిత్య లని ఎంపిక చేశారు. ఇక గీతూ రాయల్ పక్కన ఎవరూ లేనప్పటికీ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. 

ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులకు డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి సంబంధిచిన చిన్న టాస్క్ ఇస్తారు. ఇందులో ఇంటి సభ్యులు రెండుగా విడిపోవాలి. టీం ఏ .. టీం బి గా విడిపోతారు. హాట్ స్టార్ లో వచ్చే సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఈ క్విజ్ పోటీలో టీం బి విజయం సాధిస్తుంది. తన టీం ఓడిపోవడంతో  ఆరోహి ఎమోషనల్ అవుతుంది. 

ఇది కాస్త రేవంత్ వర్సెస్ ఆరోహిగా మారుతుంది. టీం ఏ తరుపున ఆరోహి క్విజ్ లో పాల్గొనడం రేవంత్ కి నచ్చదు. అందుకే టీం ఏ ఓడిపోయింది అన్నట్లుగా రేవంత్ అనడంతో ఆరోహికి కోపం వస్తుంది. రేవంత్ కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది.  చివరకు ఇద్దరూ కాంప్రమైజ్ అవుతారు. ఇక చివర్లో రేవంత్ మరోసారి ఆదిరెడ్డితో గొడవపడతాడు. రేవంత్ అతిగా మాట్లాడడం.. తానేదో ప్రత్యేకం అని చెప్పుకోవడం ఆదిరెడ్డికి నచ్చదు. దీనితో వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అంతటితో నాల్గవ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios