క్వారంటైన్ లో 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్.. వాళ్ల లిస్ట్
తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని..ఐదో సీజన్ లోకి అడుగుపెడుతోంది.ఈసారి కూడా హోస్ట్‌గా నాగార్జునే వ్యవహరించనున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకమైన బిగ్ బాస్ షో ఈ యేడు ఉంటుందా లేదా అనే సందేహాలకు చెక్ పెడుతూ నిర్వాహకులు ప్రోమో వదిలిన సంగతి తెలిసిందే. అలాగే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆగస్ట్ 22 నుంచి వారికి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు వినికిడి. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్ చేసి, సెప్టెంబర్ 5న నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపుతారట. అలాగే ప్రతి కంటెస్టెంట్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపనున్నారు.
తాజాగా మరో సర్‌ప్రైజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రోమో షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటి లాగే ఈ సారి కూడా బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది.
అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే వ్యవహరించనున్నాడు.
తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని..ఐదో సీజన్ లోకి అడుగుపెడుతోంది. బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్ విజేతగా నిలిచాడు. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు మాత్రం కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేశారు.