కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనితో బిగ్ బాస్ హౌస్ కి నిండు దనం వస్తోంది. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనితో బిగ్ బాస్ హౌస్ కి నిండు దనం వస్తోంది. 

హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే కంటెస్టెంట్స్ హంగామా మొదలు పెట్టేశారు. తాజాగా మరో అందాల భామ హౌస్ లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఒక చిత్రంలో నటించి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ హమీద. 

ధగధగ మెరిసే అవుట్ ఫిట్ లో హాట్ అప్పియరెన్స్ తో హమీద స్టేజిపైకి వచ్చింది. 'రంభ ఓర్వసి మేనకా' అంటూ అదిరిపోయే ఐటెం సాంగ్ కు పెర్ఫామ్ చేసిన హమీద నాగ్ తో ముచ్చటించింది. 

హమీద నటించిన ఏకైక చిత్రం 'సాహసం సేయరా డింభకా'. ఈ మూవీలో హమీద బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.