సోమవారం నాడు మొదలైన నామినేషన్ ప్రక్రియ మంగళవారం నాడు కూడా కంటిన్యూ అయింది. వరుణ్ కోసం చేతిపై బిగ్ బాస్ ఐ టాటూ వేయించుకుంది శ్రీముఖి. ఇక శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకి రంగువేసుకోగా.. బాబా భాస్కర్ కోసం తన షూస్ మొత్తాన్ని ఎరుపు రంగు డబ్బాలో ముంచి త్యాగం చేశాడు రవి.

ఇక హిమజ కోసం వరుణ్ పేడలో పడుకొని పెద్ద త్యాగమే చేశాడు. మంగళవారం నాటి ఎపిసోడ్ లో రవి కోసం శివజ్యోతి తన జుట్టుని కత్తిరించుకుంది. ఇక రాహుల్ కోసం పునర్నవి తనను తాను సీజన్ మొత్తం నామినేట్ చేసుకోవాలనిబిగ్ బాస్ చెప్పారు.

దానికి పునర్నవి సిద్ధమైనా.. రిస్క్ అని ఆ పని చేయొద్దని రాహుల్ కన్విన్స్ చేయడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ కెప్టెన్‌గా ఉన్న వితికాకు తన ప్రత్యేక అధికారాన్ని ఇచ్చి ఒకర్ని నేరుగా నామినేట్ చేయాల్సిందిగా కోరారు బిగ్ బాస్. దీంతో వితికా.. హిమజను నామినేట్ చేసింది. ఈ క్రమంలో పునర్నవి.. హిమజపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కింది. దీంతో వరుణ్ ఆమెపై కోప్పడ్డాడు.

''హిమజను సేవ్ చేసిన దగ్గర నుండి యాటిట్యూట్ చూపిస్తున్నావ్.. పేడలో పడుకుంది నేను కదా.. నువ్ కాదు కదా.. నువ్ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్'' అంటూ క్లాస్ పీకాడు. పునర్నవికి నేను అంటే ఎందుకు అంత ద్వేషమో నాకు అర్ధం కావడంలేదు అంటూ ఫీల్ అయ్యింది  హిమజ. ఇక ఈ వారానికి మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్  అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్.