బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం నాటి ఎపిసోడ్ తో నాలుగో వారం పూర్తిచేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. తొలి వారం ఎలిమినేషన్‌లో హేమ, రెండో వారం జాఫర్, మూడో వారంలో తమన్నా ఎలిమినేట్ కాగా.. నాలుగో వారంలో ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

ఈ ఏడుగురులో శివజ్యోతి, వరుణ్ సేవ్ అయినట్లుగా శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున వెల్లడించారు. బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలోంచి ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారో విషయంపై ఇప్పటికే లీకులు వచ్చాయి.

అందరూ ఊహించిన విధంగానే రోహిణి ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున అనౌన్స్ చేశారు. నాగార్జున.. రోహిణి పేరు చెప్పిన వెంటనే శివజ్యోతి ఎమోషనల్ అయింది. హౌస్ లో రోహిణి, శివజ్యోతిలు ఎంతో సన్నిహితంగా మెలిగారు. దీంతో రోహిణి ఎలిమినేట్ అయిందని తెలిసిన వెంటనే శివజ్యోతి వెక్కి వెక్కి ఏడ్చేసింది.