శనివారం నాటి బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో గెస్ట్ హోస్ట్ గా నటి రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన వెంటనే హీరో నాగార్జునకి బర్త్ డే వీషెస్ చెప్పి హౌస్ లో కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో మన టీవీ ద్వారా చూపించారు. తను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చానో వివరిస్తూ ఈ రెండు రోజులూ ఈ కింగ్ ప్లేస్‌లో ఈ క్వీన్ హోస్ట్‌గా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చింది రమ్యకృష్ణ.

ఇక నాగార్జున తనబర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్పెయిన్ వెళ్లినట్లు సో రెండు రోజులు బిగ్ బాస్ హౌస్ కి రాలేకపోయానని వీడియో క్లిప్పింగ్ ద్వారా హౌస్ మేట్స్ కి చెప్పారు. అనంతరం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో సరదా సరదా టాస్క్ ఆడించారు. ఇద్దరు కంటెస్టెంట్స్‌ను పిలిచి వాళ్లలో మీకు నచ్చింది.. నచ్చనిది ఏంటి అంటూ వెంట వెంటనే చెప్పాలని టాస్క్ ఇచ్చారు.

అనంతరం కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా వచ్చి ఒకవైపు పొగుడుతూనే.. మరోవైపు వాళ్లపై ఉన్న కంప్లైంట్స్ చెప్పారు. అలానే ఒక్కో కంటెస్టెంట్ కి హౌస్ లో జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకొని.. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

ఇక ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుతూ రేపటి ఎపిసోడ్ కి వాయిదా వేశారు. ఇక హోస్ట్ గా రమ్యకృష్ణ స్టేజ్ పై కాస్త కష్టపడిందనే చెప్పాలి.. స్క్రిప్ట్ ని చదువుతోందే తప్ప ఆమె యాంకరింగ్ లో ఈజ్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.