నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో ఇంటి సభ్యులకు ట్రాన్స్ జెండర్ తమన్నా కొరకరాని కొయ్యలా మారింది. రవికృష్ణ తననేదో వెన్నుపోటు పొడిచాడని, నమ్మక ద్రోహం చేశాడు అంటూ అతడిని టార్గెట్ చేస్తోంది. గేమ్ పరంగా స్ట్రాటజిక్ గా టార్గెట్ చేస్తే పర్వాలేదు.. కానీ నువ్వు మగాడివేనా.. సిగ్గులేదా అంటూ పర్సనల్ అటాక్ కు దిగడం ఇతర సభ్యులకు కూడా నచ్చడం లేదు. 

తమన్నా రోజంతా అదే పనిగా పెట్టుకున్నట్లుంది. కిచెన్ లో, లివింగ్ రూంలో, గార్డెన్ ఏరియాలో రచ్చ రచ్చ చేస్తూ రవికృష్ణపై దురుసుగా ప్రవర్తిస్తుంది. తమన్నాతో గొడవకు దిగితే ఎటు తిరిగి ఏమవుతుందో అనే భయంతో రవికృష్ణతో పాటు ఇంటి సభ్యులంతా సహనం పాటిస్తున్నారు. రవికృష్ణకు మద్దతు తెలిపే క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ కూడా తమన్నాతో గొడవేసుకున్నాడు. 

కిచెన్ లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ.. తమన్నాకు రాహుల్ ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. టూ మచ్ అవుతోంది.. ఇక ఆపండి తమన్నా గారు అని రాహుల్ కోరాడు.. ఏం కొడతావా అంటూ తమన్నా రాహుల్ ని ప్రశ్నించింది. దీనికి రాహుల్ బదులిస్తూ.. నేను ఆడవాళ్లపై చేయి చేసుకోను.. మీ లాంటివాళ్లపై అసలు చేయి చేసుకోను అంటూ కౌంటర్ ఇచ్చాడు. 

ఇది చాలా మీనింగ్ ఉన్న డైలాగ్. మాటకు మాట సమాధానం ఇస్తుంటే ఇతడితో ఎందుకులే గొడవ అని తమన్నా సైలెంట్ అయిపోయినట్లు ఉంది. రవికృష్ణనే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. రాహుల్ ఇచ్చిన కౌంటర్ కు సోషల్ మీడియాలో ప్రసంసలు దక్కుతున్నాయి. రాహుల్ మాస్ అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.