బిగ్ బాస్ సీజన్ 3 మంగళవారం నాటితో 66వ ఎపిసోడ్‌ లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ లో సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రాసెస్ గురించి బాబా భాస్కర్, వరుణ్ చర్చించుకున్నారు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనకు భాష రాదని విమర్శించడం తనకు నచ్చలేదని వరుణ్ తో అన్నారు బాబా భాస్కర్. 

జనాలు, హౌస్ మేట్స్ పది వారాలుగా తనను చూస్తున్నారని.. అలాంటిది హౌస్ మేట్ లో ఒకరు ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని అందుకే వదిలేశానని బాబా భాస్కర్ అన్నారు. మరోపక్క పునర్నవి కూడా రాహుల్ తో నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంది.

సీన్ లోకి వరుణ్, వితికాలు ఎంటర్ అవ్వడంతో పునర్నవి రెచ్చిపోయింది. 'నువ్ రవితో మాట్లాడావా..?' అంటూ వరుణ్.. వితికాని అడగడంతో 'నేను ఎందుకు మాట్లాడతా..' అని వితికా చెప్పేలోపు పునర్నవి కల్పించుకుని 'వాడా...? ఆ రవిగాడా.. వాడొక వెదవ.. ఆ వెదవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు' అంటూ తెగ రెచ్చిపోయింది.

సెన్స్ లెస్ ఆర్గ్యుమెంట్ చేసే అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడి బతుకులో  ఎప్పుడైనా తన ఒపీనియన్‌ని చెప్పాడా? అంటూ చాలా మాటలు అనేసింది.