బిగ్ బాస్ సీజన్ ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. శనివారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే నాగ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడాడు. శుక్రవారం నాటి  ఎపిసోడ్‌లో వితికా-పునర్నవిల మధ్య బిగ్ బాస్ గొడవ పెట్టడంతో ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. నేను ఏం తప్పు చేశా.. ఆమె ఎందుకు అలా ఫీల్ అవుతుందని వితికా బాధపడగా వరుణ్ ఓదార్చే ప్రయత్నం చేశారు.

బాబా భాస్కర్ సలహా మేరకు పునర్నవికి సారీ చెప్పాలని వెళ్లిన వితికా.. గొడవను ఇంకా పెద్దది చేసింది. ఆ తరువాత మళ్లీ వితికా ప్లీజ్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఎప్పటిలానే హౌస్ మేట్స్ ప్రవర్తన నచ్చక వారి తప్పులను ఎత్తిచూపారు నాగార్జున. ముందుగా అలీతో మాట్లాడుతూ గతవారం స్కిట్ లో తన పెర్ఫార్మన్స్ బాగుందని పొగిడారు. అగ్రెసివ్ గా ఉండే అలీకి చురకలు వేశారు నాగ్.

ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంత అహంకారం ఎందుకు? హౌస్‌లో ఏదైనా జరుగుతుంటే హౌస్‌లో పెద్ద మనిషిగా ఉన్న బాబా భాస్కర్.. మీరు ఆపాలి కాదా? అని  ప్రశ్నించడంతో. దానికి సిల్లీగా రియాక్ట్ అయ్యారు బాబా భాస్కర్. దీనికి నాగార్జున.. ఇది కామెడీ కాదు.. సీరియస్ అంటూ సీరియస్‌‌గా క్లాస్ పీకారు. ఎప్పటిలానే ఈ వారం కూడా హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు నాగార్జున. 

ఇందులో భాగంగా.. హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో మీకు ఎవరు శత్రువు? ఎవరు మిత్రుడు? ఎవరు వెన్నుపోటుదారు? అనుకుంటున్నారని రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ఈవారం  ఎలిమినేషన్‌లో ఏడుగురు రాహుల్,హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌లు ఉండగా.. ఈ ఏడుగురిలో మహేశ్, శివజ్యోతి సేవ్ అయినట్లు తెలిపారు.