బిగ్ బాస్ సీజన్ 3 రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలానే సోమవారం నాడు ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు బిగ్ బాస్. అయితే ఈసారి ప్రాసెస్ ఓపెన్ గా జరిగింది. ఒక్కో కంటెస్టంట్ బహిరంగంగానే తమ కారణాలు చెప్పి మరో ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇందులో భాగంగా రవికృష్ణ తన రీజన్స్ చెప్పి ట్రాన్స్ జెండర్ తమన్నాని నామినేట్ చేశాడు.

అంతే.. అప్పటినుండి తమన్నా.. రవిని టార్గెట్ చేస్తూ అతడికి నరకం చూపిస్తుంది. నోటికొచ్చినట్లు అతడిని తిట్టిపోస్తూ ఒకరకంగా టార్చర్ చేస్తోంది. ఇంట్లో సభ్యులు ఆమెని  ఎంతగా మందలిస్తున్నా.. తమన్నా మాత్రం ఈ విషయంలో అసలు తగ్గడం లేదు. ఈ ఇష్యూ మీద బిగ్ బాస్ రవికృష్ణ, శ్రీముఖిలతో మాట్లాడాడు. తమన్నాని హౌస్ లోకి పంపించడం ద్వారా సంచలనానికి తెర తీసిన బిగ్ బాస్ నిర్వాహకులు ఒకటి భావిస్తే ఇప్పుడు మరొకటి జరుగుతోంది. 

ట్రాన్స్ జెండర్ ఉండడం వలన షోకి కొత్త డైమెన్షన్స్ వస్తాయని భావిస్తే మొత్తం రివర్స్ అయ్యి షో అసహ్యంగా మారింది. సోషల్ మీడియాలో వస్తోన్న రెస్పాన్స్ ని బట్టి తమన్నాని మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీకెండ్ లో నాగార్జునతో ఇంటరాక్ట్ అయి ఆమెని బయటకి పంపడం కంటే సరైన సెండ్ ఆఫ్ లేకుండా వ్యక్తిగత  దూషణలకు దిగినందుకు, హౌస్ పరువు తీస్తున్నందుకు నేరుగా ఎలిమినేషన్ ఇచ్చేస్తారని బలంగా వినిపిస్తోంది.

ఒకవేళ ఆమెని బయటకి పంపితే ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు పరిణామాలు చోటుచేసుకుంటాయో బిగ్ బాస్ నిర్వాహకులు ఊహించలేకపొతున్నారు. మరేం జరుగుతుందో  చూడాలి!