బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖికి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఆమె హౌస్ లోకి వెళ్లకముందు నుండే ఆర్మీలు తయారయ్యాయి. ఆమె టైటిల్ కొట్టే వరకు హౌస్ లోనే ఉంచాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

అలాంటిది ఆమె మొదటివారంలోనే ఎలిమినేషన్ కి రావడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. షో మొదలై మూడు ఎపిసోడ్ లు పూర్తికాకపోగా.. అప్పుడే శ్రీముఖి ఆర్మీ అలర్ట్ అయింది. ఆమెపై మీమ్స్ తో పాటు ఆమెకి సపోర్ట్ చేయాలంటూ శ్రీముఖి ఆర్మీ సోషల్ మీడియా యుద్ధం మొదలుపెట్టింది.

'మా శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ ని తగలబెట్టేస్తాం' అంటూ ఫన్నీ మీమ్స్ మొదలుపెట్టేశారు. కొందరైతే 'మా అక్క శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే రాష్ట్రాలు తగలబడిపోతాయ్' అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. శ్రీముఖిని ట్రోల్ చేసేవారు కూడా ఉన్నారనుకోండి.. ఆమె గట్టిగా అరవడంపై కూడా మీమ్స్ వస్తున్నాయి.

మొదటివారంలోనే శ్రీముఖిని ఎలిమినేషన్ కి పంపించి షోపై ఆసక్తిని తీసుకొచ్చారు నిర్వాహకులు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఆమెకి బదులుగా హిమజని రీప్లేస్ చేయడంతో శ్రీముఖి అభిమానులు శాంతించారు. లేదంటే సోషల్ మీడియాలో రచ్చ మాములుగా ఉండేది కాదేమో..!