బిగ్ బాస్ సీజన్ ఆరో వారం పూర్తి చేసుకోబోతుంది. శుక్రవారం ఎపిసోడ్ బాబా భాస్కర్ నేను బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయితే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పెడతా అన్నారు. ఇలా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడలు కనిపించేలా తిరిగితే కుదరదని పునర్నవికి పంచ్ ఇచ్చారు బాబా భాస్కర్. అలానే ఎవరూ పొట్టి బట్టలు వేసుకోకూడదని, అలీ కూడా షర్ట్ విప్పి తిరిగితే కుదరదని అన్నారు.

దానికి పునర్నవి తనకు నచ్చినట్లే డ్రెస్ చేసుకుంటానని బదులిచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ అవ్వడానికి బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ సందేశ్ లు పోటీ పడ్డారు. దీనికోసం 'మట్టిలో ఉక్కు మనిషి' అనే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. ముగ్గురికి మూడు రంగుల బాల్స్ ఇచ్చి వాటిని మట్టిలో నుండి వెతికి పట్టుకుని బాస్కెట్‌‌లో వేయాలన్నారు. 

ఫైనల్‌గా ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్లే బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌గా ఉంటారని చెప్పారు. ఈ టాస్క్ కాస్త ఫిజికల్ టాస్క్ గా మారింది. ఫైనల్ గా వరుణ్ సందేశ్ బాస్కెట్ లో ఎక్కివ బాల్స్ ఉండడంతో అతడు గెలుపొంది కెప్టెన్ అయ్యాడు. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా 'రంగుపడుద్ది' అనే టాస్క్ ఇచ్చారు.

ఈ టాస్క్ ప్రకారం హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న వరుణ్ రోప్‌కి కట్టేసి రంగుబాల్స్‌‌తో కొట్టమని.. అలా కొట్టిన బాల్ వెళ్లి ఏ ఐటమ్‌కి తగిలితే ఆ ఐటమ్ లగ్జరీ బడ్జెట్‌గా వస్తుందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఎంతో సరదాగా సాగింది.