బిగ్ బాస్ సీజన్ 3.. మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. మూడో వారం తమన్నా ఎలిమినేట్ కావడంతో నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తితో నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ కాస్త డిఫరెంట్ గా జరిగింది.

ఇద్దరిద్దర్ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారంటూ బిగ్ బాస్ ప్రశ్నించారు. ముందుగా రవి, వితికా జంటగా వెళ్లగా.. రవి నామినేట్ అయి వితికాని సేఫ్ చేశాడు. రోహిణి, శివ జ్యోతిని జంటగా పిలిచారు బిగ్ బాస్. వారిద్దరు ఒక అండర్‌స్టాడింగ్‌తో శివజ్యోతి నామినేట్ కాగా.. రోహిణి సేఫ్ అయింది. 

ఫైనల్ గా నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు నాలుగో వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. ఈ  ఏడుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు.

నామినేషన్స్‌ గురించి ఒకరితో ఒకరి సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. శివజ్యోతి, రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలాడటంతో బిగ్ బాస్ హెచ్చరిస్తూ శివజ్యోతి నాలుగోవారం ఇప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. ఈవారానికి కాకుండా.. వచ్చే వారానికి కూడా ఇద్దర్నీ డైరెక్ట్‌గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు.