బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో వినాయకచవితి సంధర్భంగా హౌస్ మేట్స్ ఇంటిని డెకరేట్ చేసి వినాయకచవితి సంబరాలు జరుపుకున్నారు. ఆ తరువాత ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టిన బిగ్ బాస్ ఇద్దరు చొప్పున కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించారు.

అక్కడ సీక్రెట్ ఫ్రెండ్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాబోతున్న శిల్పా చక్రవర్తి హౌస్ మేట్స్ తో ముచ్చటించింది. చీకటిలో ఉన్న శిల్పాని ఎవరూ గుర్తుపెట్టలేదు. ఇంటిసభ్యులందర్నీ  ఇంటర్వ్యూ చేస్తూ.. నామినేషన్‌ ప్రక్రియను శిల్పా చక్రవర్తి పూర్తి చేసింది. ఇక దీంతో ఇంటి సభ్యుల మనస్తత్వం ఏంటో.. వారికి ఎవరంటే నచ్చదు.. ఇలా ప్రతీ విషయం శిల్పాకు తెలిసింది.

కన్ఫెషన్‌ రూమ్‌కు వెళ్లిన హౌస్‌మేట్స్‌.. ఆమెను కనిపెట్టడానికి ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు.ఈ నామినేషన్‌ ప్రక్రియ పూర్తైందని అనుకుంటూ లివింగ్‌ ఏరియాలో ఉన్న హౌస్‌మేట్స్‌ కి సర్ప్రైజ్ ఇస్తూ శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించింది. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా.. రెండు పేర్లను సూచించాలని శిల్పాను బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

ఇంతవరకు నామినేషన్‌ ఫేస్‌ చేయలేదని అలీని, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని శ్రీముఖిని నామినేట్‌ చేసింది. ఇక ఏడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌లో రాహుల్, మహేష్ విట్టా, రవి, అలీ, శ్రీముఖి ఐదుగురు ఉన్నారు.