ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా ‘రాళ్లే రత్నాలు’ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సోమవారం నాడు ప్రారంభమైన ఈ టాస్క్ రెండో రోజు కొనసాగింది. తొలిరోజులో పూర్ పెర్ఫామెన్స్ ఇచ్చిన రాహుల్ ఇప్పటికే నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ లో రాళ్ల కోసం హౌస్ మేట్స్ తలపడ్డారు.

వితికా పట్టుకున్న విలువైన రాళ్లను లాక్కునే ప్రయత్నం చేయడంతో బాబా, అలీలపై మండిపడింది వితికా. ఈ ప్రయత్నంలో వరుణ్ ముక్కుకి దెబ్బ తగిలి రక్తం కారడంతో వితికాకి కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు హౌస్ మేట్స్ ని తిట్టడంతో వరుణ్ కల్పించుకొని వితికాకి క్లాస్ తీసుకున్నాడు.

దీంతో ఆమె కాస్త అలిగింది. కాసేపటికి వరుణ్ కూల్ అయ్యి వితికాని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన ‘రాళ్లే రత్నాలు’ నామినేషన్ ప్రక్రియలోమొదటిరోజు రాహుల్ ఎలిమినేట్ కాగా.. అతని తరువాత మహేష్ విట్టా, పునర్నవి, వరుణ్ సందేశ్‌లు నామినేషన్‌లో నిలిచారు.

వీరి నలుగురులో వరుణ్ ఎలాగూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అతడు సేవ్ అవ్వడం ఖాయం. ఇక రాహుల్ కి మొదటి నుండి ఓట్లు బాగా పడుతున్నాయి కాబట్టి అతడు కూడా సేవ్ అయ్యే చాన్స్ లు బాగానే ఉన్నాయి. ఇక మిగిలిన ఇద్దరిలో పునర్నవి ని బయటకి పంపితే లవ్ ట్రాక్ మిస్ అవుతుందని మహేష్ ని పంపుతారో..? లేక పునర్నవినే ఎలిమినేట్ అవుతుందో చూడాలి!