బిగ్ బాస్ సీజన్ 3 గురువారం ఎపిసోడ్ వరుణ్ కి, వితికాకు మధ్య గొడవతో మొదలైంది. వరుణ్ కి దూరంగా ఓ మూలన కూర్చొని ఏడుస్తున్న వితికాను ఉద్దేశించి.. కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు అంటూ వరుణ్ చెప్పడంతో వితికా ఏడవడం మొదలుపెట్టింది.

'టైం స్పెండ్ చేయి.. టైం స్పెండ్ చేయి అంటే ఏం మాట్లాడుతున్నావ్ అసలు. మనం వచ్చింది బిగ్ బాస్ షోకి హనూమూన్‌ కి కాదు. అది నీకు అర్ధం అవుతుందా?' అని మాట్లాడుతూ వితికాను మరింత ఏడిపించాడు వరుణ్. దీంతో వితికా కూడా వరుణ్ పై అరిచింది. అలా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వితికా బాధను తట్టుకోలేక బాత్రూమ్ కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేసింది.

దీంతో ఆమె వెనుక వెళ్లిన వరుణ్ కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక జైలులో ఉన్న రవి, రాహుల్ ల దగ్గర కూర్చున్న పునర్నవిని ఉద్దేశిస్తూ రాహుల్.. అది పిచ్చిది అలానే మాట్లాడుతూ ఉంటుందని చెప్పడంతో బాధ పడిన పునర్నవి అక్కడ నుండి వెళ్లిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రవి.. రాహుల్ ని తిట్టాడు. ఇంతలో రవితో మాట్లాడదామని వచ్చిన వరుణ్ కూడా రాహుల్ ప్రవర్తనతో చిరాకు పడ్డాడు.

ఇంతలో బిగ్ బాస్ వాళ్ల జైలు శిక్ష ముగిసినట్టు ప్రకటించారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో బాబా భాస్కర్, శ్రీముఖి, హిమజ పోటీ పడ్డారు. 'ఆపిన వాడిదే అధికారం' అంటూ సాగిన ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యారు.